ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే అసలు మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఒకప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్షరాస్యత పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం యువత మొత్తం పెద్ద పెద్ద చదువులు చదివి ఇక ప్రతి విషయంలో కూడా ఉన్నతంగానే ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. ఇక మంచి మంచి ఉద్యోగాలు సాధించి లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇలాంటి నేటి రోజుల్లో కూడా కొంతమంది యువత ఆలోచిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఏకంగా చిన్న చిన్న అవసరాలకే నేరాలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. చేసేది తప్పు అని తెలిసిన కూడా తప్పదు అన్నట్లుగానే చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది ఏకంగా చోరీలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా స్నేహితుడి పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకున్నారు మిగతా స్నేహితులు. డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.


 ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా 9 మంది స్నేహితులు కలిసి ఒక స్నేహితుడు పుట్టినరోజు కోసం మొబైల్స్ దొంగతనం చేయడానికి ప్రయత్నించి చివరికి పోలీసులకు దొరికారు. స్నేహితుడి బర్త్ డే కి ఖరీదైన మందు, మాంసం, భారీ కేక్ తీసుకువచ్చి ఘనంగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు.. కానీ వారి వద్ద ఉన్న డబ్బులు సరిపోవు అని వారికి అర్థమైంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వారిని బెదిరించి సెల్ ఫోన్లు దొంగలించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏకంగా ఎనిమిది మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: