
మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఇప్పటికి ఎంతోమంది విశ్వసిస్తున్నారు. దయ్యం భూతం ఉంది అని నమ్ముతూ ఇంకా అనాగరిక పోకడలకు పోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే కారణంతో ఎంతోమందిపై దారుణంగా దాడులు చేస్తున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది. మంత్రాలు చేస్తూ చేతబడులు చేస్తుంది అన్న కారణంతో ఒక మహిళపై దారుణంగా దాడి చేశారు గ్రామస్తులు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఇబడి సత్తవ్వ మంత్రాలు చేస్తుంది అనే నెపంతో గ్రామస్తులందరూ కూడా ఆమెపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. అయితే తనకేం తెలియదు అని సత్తవ్వ వేడుకుంటున్న కనీసం కనికరం చూపలేదు. అయితే ఈ ఘటన సంచలనంగా మారగా సత్తవ్వ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనె రంగంలోకి దిగిన పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సత్తవ్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.