కావాల్సిన ప‌దార్థాలు: 
వంకాయలు- ఐదు
పెరుగు- ఒక కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
ఎండు మెంతి- ఒక టీ స్పూను

 

కొత్తిమీర తరుగు- కొద్దిగా
నూనె- ఐదు టీస్పూన్లు
జీలకర్ర- ఒక టీస్పూను
బిర్యాని ఆకు- ఒకటి

 

ఇంగువ- చిటికెడు
ఉల్లితరుగు- పావు కప్పు
పసుపు- పావు టీస్పూను
కారం- అర టీస్పూను

 

అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను
శనగపిండి- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- అర టీ స్పూను
గరం మసాల- పావు టీ స్పూను

 

తయారీ విధానం:
ముందుగా పాన్‌లో మూడు టీస్పూన్లు నూనె వేసి తరిగిన వంకాయ ముక్కలు దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. మ‌ళ్లీ అదే పాన్‌లో మిగతా నూనె వేసి జీలకర, బిర్యానీ ఆకు, ఇంగువ, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఇప్పుడు శనగపిండి చల్లి చిన్నమంటపై ఐదు నిమిషాలు ఉంచాలి. 

 

ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాల, ఉప్పు వేయాలి. తర్వాత నీరు,  పెరుగు కలిపి చిన్నమంటపై మగ్గించాలి.  కొంత స‌మ‌యం తర్వాత వేగించిన వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మ‌గ్గ‌నివ్వాలి. ఇక‌ చివ‌రిగా  మెదిపిన ఎండు మెంతి, కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ పెరుగు వంకాయ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: