కావాల్సిన ప‌దార్థాలు:
బీట్‌రూట్‌ తురుము- ఒక కప్పు
బొంబాయిరవ్వ- అరకప్పు
నూనె- వేయించడానికి సరిపడా

 

పంచదార- ఒకటింపావు కప్పు
యాలకుల పొడి- ఒక టీ స్పూన్‌
కొబ్బరి తురుము- పావుకప్పు
మినప్పప్పు- కప్పు

 

ఉప్పు- చిటికెడు 
బియ్యం- రెండు కప్పులు
నెయ్యి- రెండు చెంచాలు

 

తయారీ విధానం: ముందుగా బియ్యం, మినప్పప్పును నాలుగు గంటల ముందు నానబెట్టుకుని ఆ తరువాత మెత్తగా పిండిలా రుబ్బుకుని ఉప్పు వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో అరకప్పు నీళ్ళు మరిగించి బీట్‌రూట్‌ తురుము, బొంబాయిరవ్వ, పంచదార వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక స్పూన్‌ నెయ్యి వేస్తే అడుగు అంటకుండా ఉంటుంది. ఇక ఐదారు నిమిషాలకు బొంబాయిరవ్వ ఉడికి మిశ్రమం దగ్గరపడుతుంది. 

 

అప్పుడు కొబ్బరితురుము, యాలకుల పొడి వేసుకుని పొయ్యి కట్టేయాలి. ఇది చల్లారాక ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఈ ఉండల్ని ముందుగా చేసిపెట్టుకున్న పిండిలో ముంచి కాగుతోన్న నూనెలో వేయాలి. బాగా వేగాక ప్లేట్‌లోకి తీసుకుని స్టౌ ఆఫ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ బీట్‌‌రూట్ పూర్ణాలు రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: