కావాల్సిన‌ పదార్థాలు: 
నాటు కోడి మాంసం- ఒక కేటి
ఉల్లిపాయముక్కలు- ఒక క‌ప్పు
కాశ్మీర్‌ కారం పొడి- ఒక‌ టీ స్పూన్‌
మ‌సాల పొడి- రెండు టీ స్పూన్లు

 

అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు టీ స్పూన్లు
నూనె- తగినంత
కరివేపాకు- నాలుగు రెబ్బలు

 

కారం- రెండు టీ స్పూన్లు
పసుపు- అర టీ స్పూన్‌
ఉప్పు- రుచిక‌ తగినంత
కొత్తిమీర- ఒక కట్ట

 

తయారీ విధానం:
ముందుగా నాటు కోడి మాంసాన్ని తీసుకుని శుభ్రంగా నీటిలో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఉల్లిపాయ పేస్ట్‌, ఉప్పు వేసి బాగా కలుపుకుని రెండు గంట‌ల పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి.. మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయంచుకోవాలి. 

 

ఇప్పుడు అందులో కొద్దిగా మసాలా పొడి, కారం, ఉప్పు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఆ త‌ర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర జ‌ల్లి ఐదు నిమిషాల త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంటే నోరూరించే వేడి వేడి  నాటుకోడి పులుసు రెడీ. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. 

 

ఇక నాటుకోడి మాంసానికి రోజురోజుకు డిమాండ్‌ పెరుగు తోంది. కొవ్వు శాతం తక్కువగా ఉండడం, పోషకాలు అధికంగా ఉండడంతో నాటుకోడి మాంసం తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. నాటుకోడితో చేసే వంటలు ఏవైనా సరే చాలా రుచిగా, నోరూరిస్తుంటాయి. మ‌రియు ఆరోగ్య‌న్ని కూడా అందిస్తాయి. కాబ‌ట్టి.. ఈ మీరు కూడా పైన చెప్పిన విధంగా ఓ సారి నాటుకోడి పులుసు త‌యారు చేసికుని.. ఎంజాయ్ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: