కావాల్సిన ప‌దార్థాలు:
బంగాళాదుంపలు - నాలుగు
కారం - ఒక టీస్పూన్‌
టమోటో సాస్ - ఒక టీస్పూన్స్‌చిల్లీ సాస్ - ఒక టీస్పూన్‌
వెల్లుల్లి రెబ్బలు - రెండు
ఉల్లి పాయ ముక్క‌లు - అర క‌ప్పు
కార్న్ ఫ్లోర్ - రెండు టీస్పూన్లు

 

సోయా సాస్ - ఒక టీస్పూన్‌
పచ్చిమిర్చి - మూడు
కొత్తిమీర - ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలు నీటిలో బాగా కడిగి.. మీకు నచ్చిన సైజ్‌లో క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి కార్న్ ఫ్లోర్ కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. పాన్‌ పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. 

IHG

ఇప్పుడ స్టవ్ మీద మరో పాన్‌ పెట్టి అందులో కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం వేసి వేయించాలి. అవి బాగా వేగాక అందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలిపి మళ్లీ వేయించాలి. ఇప్పుడు కాస్త ఉప్పు, కొత్తిమీర‌ కూడా వేసుకోవాలి. 

IHG

అనంత‌రం స్టవ్ ఆఫ్ చేసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని చల్లారబెట్టి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ముందగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ బంగాళాదుంప మంచూరియా రెడీ అయిన‌ట్లే. సాయంత్రం వేళ‌లో దీన్ని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ పొటాటో మంచూరియా మీరు కూడా త‌యారు చేసుకుని.. ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: