నిజానికి కొంతమంది చావు అంతు చిక్కకుండా ఎందుకు చనిపోతామని తెలియకుండా చనిపోవడం జరుగుతుంది. ఇక తాజాగా తాను పట్టుకున్నది బొమ్మ తుపాకీ అని అనుకొని పేలిస్తే ఏమి కాదులే అనుకున్నాడు ఓవ్యక్తి. కాకపోతే అది నిజం తుపాకీ. బొమ్మ తుపాకీ అనుకోని తుపాకి గురి పెట్టి కాల్చేశాడు. ఇంకేముంది ఆ వర్జినల్ తుపాకీ లో నుంచి వచ్చిన తూటా సరాసరి అతడి శరీరం లోకి దూసుకెళ్లి పోయింది. దీంతో అక్కడికక్కడే తాను ప్రాణాలతో రక్తం కారుతూ విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలేశాడు.

 


ఇక ఈ సంఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని ధాని జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని షహపుర్ లో ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని వారు వివరాలు ప్రకటించిన మేరకు ఆటగావ్ ఈ ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీలో ఓ వ్యక్తి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుకలో తన పక్క ఫ్లాట్ లో ఉంటున్నా సిద్ది జగన్ అనే 28 ఏళ్ల యువకుడు హాజరయ్యాడు. అయితే ఆ ఇంట్లో తుపాకీ కనిపించడంతో దానిని చేతుల్లోకి తీసుకొని బొమ్మ తుపాకీ అనే భ్రమలో అతడి ప్రాణం కోల్పోయాడు.

 


నిజంగా అది వర్జినల్ తుపాకీ అని తెలియక పోవడంతో దానిని పేల్చడం జరిగింది. ఇక దీంతో తుపాకీ నుంచి దూసుకొచ్చిన బులెట్ శరీరంలోకి దూసుకుపోయింది. ఇక అంతే అతడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇక దాంతో తుపాకీ పేలింది... దానితో ఆ శబ్దానికి అందరు బర్త్డే పార్టీలో ఉన్న వారంతా అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. దీనితో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే ఆ తుపాకీ భరత్ అనే వ్యక్తికి సంబంధించిందని పోలీసులు నిర్ధారించారు. ఇకపై ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: