సైదాబాద్, సింగ‌రేణి కాల‌నీ హత్యాచార కేసులో మరో కీలక ఆధారం దొరికినట్టు తెలుస్తోంది. నిందితుడు తప్పించుకునేందుకు అతడి స్నేహితుడు సహకారం చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కోసం పోలీసులు మరియు తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లిన‌ట్టుగా పోలీసుల‌కు స్థానికులు చెప్పారు. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ రాజుకు త‌న స్నేహితుడు చెప్పినట్లు తెలిసింది. బస్తీవాసులు రాజును గుర్తుపట్టకుండా ఉండేందుకు అత‌డికి టోపీ, మాస్కు, ఒక జత బట్టలతో కూడిన సంచిని ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ఆరోపణలకు బలం చేకూర్చుతూ అక్కడ ఉన్న‌ సీసీ కెమెరాలో రాజు మ‌రియు అతడి స్నేహితుడు వెళ్తున్న ఫోటోలను పోలీసులు సేకరించారు. 

ఇక పోలీసులు నింధితుడు రాజు స్నేహితున్ని అదుపులోకి తీసుకుని విచారించ‌గా....ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బి నగర్ వద్ద మరో స్నేహితుడితో మద్యం నిందితుడు రాజు మ‌ద్యం తాగిన‌ట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మ‌ద్యం తాగిన వీడియోలు ఎల్బినగర్  వద్ద సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక రాజు స్నేహితుడు రాజు చేసిన నేరం తెలీదని చెప్పిన పోలీసుల విచార‌ణ‌లో చెప్పాడు. మద్యం సేవించిన‌ తరువాత రాజు ఎటు పోయాడో తనకు తెలియ‌దని చెబుతున్నాడు. ఇక గతంలో రాజు పై ఒక బైక్ దొంగ తనం కేసు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అంతే కాకుండా రాజు ప్రవర్తన నచ్చక పోవ‌డంతో అతడి భార్య కూడా వ‌దిలి వెళ్లిపోయిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయ్యింది. ఇక నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం వంద మంది పోలీసులు రాజు కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జనగామ, యాదాద్రి జిల్లాల్లో దుర్మార్గుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ మాత్రం నింధితుడిని గంట‌ల్లోనే ప‌ట్టుకున్నామంటూ చెప్ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. అదే విష‌యం పోలీసుల‌ను అడితే వాళ్లు అదేం లేద‌ని నింధితుడి కోసం గాలిస్తున్నామ‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: