హ‌ర్యానా రాష్ట్రంలోని పానిప‌ట్ జిల్లాలో  స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే విధంగా ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి ఓ  విద్యార్థినిపై పొరుగు ఇంట్లో  ఉంటున్న తండ్రీకొడుకులు క‌లిసి  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  మత్తుమందు ఇచ్చి ఆ న‌ర‌రూప రాక్ష‌సులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని బాధితురాలు పేర్కొంది.  

పానిపట్లోని మోడల్ టౌన్లో కుటుంబ సభ్యులతో క‌లిసి ఆ విద్యార్థిని నివ‌సిస్తున్న‌ది. తన ఇంటికి స‌మీపంలో ఉంటున్న అజయ్ అనే యువకుడు ఆ బాలికను ప్రేమిస్తున్నాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. ఈ నేప‌థ్యంలోనే కౌమ‌ర‌ద‌శ‌లో ఉన్న ఆ బాలిక అత‌ని మాయ మాట‌లు న‌మ్మి తెలిసి తెలియ‌ని వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డింది. ఈ ప్రేమ కాస్త లైంగిక దాడికి దారి తీసిన‌ది. ఆ బాలిక‌ను అజ‌య్ త‌న ఇంటి వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. ఇది గ‌మ‌నించిన అజ‌య్ తండ్రి స‌ద‌ర్‌, అత‌ని సోద‌రుడు అర్జున్ మ‌త్తు మందుతో కూడిన సిగ‌రేట్ కాల్చ‌మ‌ని బాలిక‌ను ఇబ్బంది పెట్టారు.

ఈ స‌మ‌యంలో ఆ బాలిక తాను అజ‌య్‌ను వివాహం చేసుకుంటాను అని చెప్ప‌డంతో వెంట‌నే ఆమెపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు నెలల పాటు బాలికను తమ ఇంట్లోనే బంధించి చిత్ర హింస‌లు గురి  చేయ‌డ‌మే కాకుండా రాక్ష‌స క్రీడ కొన‌సాగించారు. నిత్యం బాలిక‌కు డ్ర‌గ్స్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్ప‌డేవారు.  ఏమి జ‌రుగుతుందోన‌ని కూడ తెలియ‌ని ప‌రిస్థితిలోకి  ఆ బాలిక వెళ్లిపోయింది. మాన‌సిక ఆరోగ్యం సైతం క్షీణించింది. చివ‌ర‌కు వారి నుంచి ఎలాగో త‌ప్పించుకొని త‌న ఇంటికి చేరుకుంది బాలిక‌.

 ఆ బాలికను తీసుకెళ్లార‌ని  త‌ల్లి ప‌లుమార్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించింది. రెండు నెల‌ల తరువాత ఆ బాలిక ఇంటికి చేరుకున్న త‌రువాత న్యాయం కోసం త‌ల్లీకూతుర్లు ముఖ్య‌మంత్రి నివాసానికి వెళ్లారు. త‌క్ష‌ణ‌మే తేరుకున్న పోలీసులు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి నిందితులైన అజ‌య్‌, స‌ద‌ర్‌, అర్జున్‌, అజ‌య్‌త‌ల్లిని అదుపులోకి తీసుకున్నారు.  ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌నపై  ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: