ఈ రోజుల్లో చిన్నారులు చదువుల్లో ఎంతో చురుగ్గా ఉంటున్నారు.. కేవలం చదువులోనే కాదు ఆటల్లో కూడా ఎంతో  చురుకుగానే కనిపిస్తున్నారు. ఇలా ఒకప్పటి పిల్లలతో పోలిస్తే నేటి రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. అదేంటో గానీ చదువుల్లో మాత్రమే కాదు ఆత్మహత్యల్లో కూడా నేటి రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అని చెప్పాలి. తెలిసో  తెలియకో కానీ నేటి రోజుల్లో పాఠశాల దశలోనే ఉన్న విద్యార్థుల్లో  ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం దురదృష్టకరం. ఎలా చదువుకోవాలి ఎలా ఫస్ట్ రావాలి అని ఆలోచన రావాల్సింది పోయి ఆత్మహత్య ఎలా చేసుకోవాలి.. ఎలా ప్రాణం పోతుంది అని ఆలోచించే స్థాయికి ఎదిగారు.



 చిన్న చిన్న కారణాలకు  జీవితం మొత్తం వృధా అయిందని భావించి చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది చిన్నారులు. తల్లిదండ్రులు తమ పిల్లల పై పెట్టుకున్న ఆశలను అడియాశలు గా మారుస్తున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని చివరికి తల్లిదండ్రులకు తీవ్రమైన కడుపుకోత మిగులుస్తూ శోకసంద్రంలో మునిగిపోయేలా చేస్తున్నారు. క్షణికావేశంలో చిన్నారులు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమంది జీవితాన్ని అర్ధాంతరంగా మోగిస్తున్నాయి అని చెప్పాలి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది అనే చెప్పాలి. సిద్దిపేట జిల్లా కొండపాక లో వెలుగులోకి వచ్చింది ఈ విషాదకర ఘటన. రాముడ్డి పల్లి గ్రామానికి చెందిన చింతల పూజ అనే బాలిక గత మూడేళ్ళ నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి అంటూ లేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పూజ కడుపు నొప్పి మాత్రంఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలోనే మనస్థాపం చెందిన పూజ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: