మనిషి జీవితం దేవుడు చేతిలో బొమ్మలు కీలుబొమ్మ లాంటిది అని చెబుతూ ఉంటారు ఎంతో మంది పెద్దలు. అయితే నేటి రోజుల్లో ఇది కేవలం ట్రాష్ అనే కొట్టిపారేస్తూ ఉంటారు.. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తూ అందరూ షాక్ అవుతున్నారు. అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని ఘటనలు ఏకంగా మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉంటాయి. ఇక అనుకొని ఘటనలు కుటుంబాలను విషాదంలోకి నెడుతూ ఉంటాయ్. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పండుగ పూట ఊహించని విషాదం కుటుంబంలోని  అందరినీ శోకసముద్రంలో నెట్టింది. పిండి గిర్నీ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆ మహిళ పిండి గిర్నీ నడుపుతూ  వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇక పిండి గిర్ని ద్వారా సంతోషంగానే ఉంది. కానీ చివరికి అదే పిండిని ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుంది అని మాత్రం ఊహించలేకపోయింది. సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితాన్ని చూసి విధి కక్ష కట్టినట్లు వ్యవహరించింది. చివరికి ఉపాధి ఇచ్చిన ఆ పిండి గిర్ని ఆమె ప్రాణాలను కూడా తీసేసింది. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో పిండి గిర్నీ పెట్టే మోటార్ బెల్ట్ పై పడి కవిత అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.


 ఇక పండగ పూట జరిగిన ఈ విషాదకర ఘటన తో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. సంతోషంగా సంక్రాంతి పండుగను చేసుకోవాలనుకున్న కుటుంబానికి అనుకోని  విధంగా విషాదకర ఘటన ఎదురు కావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఉదయం పూట పిండివంటలు చేసుకోవడానికి పిండి పట్టడం కోసం గిర్ని వద్దకు వెళ్ళింది మహిళ. ఈ క్రమంలోనే పిండి పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గిర్నీ బెల్ట్ పై పడింది. దీంతో చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: