ఉపాధ్యాయుడు అంటే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తును అందించాలి. ఏకంగా తన దగ్గర చదువుకున్న విద్యార్థులను తమ సొంత బిడ్డలా చూసుకోవాలి.. ఇక ఇటీవల కాలంలో ఎంతో మంది ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత ఖర్చులతో చదివిస్తున్న ఘటనలు  కూడా వెలుగులోకి వస్తున్నాయి.. అందుకే ఇక అటు టీచర్ వృత్తి ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు మాత్రం  టీచర్ వృద్ధికి వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థుల విషయంలో కామంతో ఊగిపోతున్నారు ఎంతోమంది.


 ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఇలాంటిదే చేసాడు. ఏకంగా విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపించి వేధింపులకు పాల్పడ్డాడు. అయితే టీచర్ తీరుతో షాక్ అయిన విద్యార్థులు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వెంటనే స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఏకంగా టీచర్ ను చిదకబాదారు. ఈ ఘటన తెలంగాణ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి అశ్లీల వీడియోలు చూపిస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు.


 ఇటీవలే విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ పేరుతో స్మార్ట్ఫోన్ వాడుతూ కనిపించగా.. అందులో ఒక సమాచారాన్ని పంపాను అంటూ చెప్పాడు ఉపాధ్యాయుడు. తీరా అది తెరిచి చూస్తే అశ్లీల వీడియో ఇక అది చూసి భయపడి పోయిన విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఇక ఇటీవలే క్లాస్ రూమ్ లో ఒక డౌట్ వచ్చింది అంటూ విద్యార్థిని అడగగా ఏకంగా ఒక అశ్లీల వీడియో పెట్టి ఆమెకు ఇచ్చాడు.  దీంతో షాక్ అయిన విద్యార్థి పేరెంట్స్ కి సమాచారం అందించింది. ఇలా ఎంతోమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో ఇక చివరికి స్కూల్ వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిని చితకబాదారు తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: