ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా 7 ఏళ్ల బాలిక పై కన్నేసిన 45 ఏళ్ల వ్యక్తి చివరికి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఇక ఆ బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి 45 ఏళ్ల వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన భూపాల్ లో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే 7 ఏళ్ల బాలిక ఆయిల్ ప్యాకెట్ తీసుకువచ్చేందుకు సమీపంలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళింది. అయితే బాలిక ఒంటరిగా కనిపించడంతో 45 ఏళ్ల ముస్తాక్ లో కామాంధుడు బయటికి వచ్చాడు.
ఈ క్రమంలోనే బాలికను ముద్దుగా దగ్గరికి పిలిచి ఇలా అసభ్యంగా తాగడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అతని ప్రైవేట్ పార్ట్ ను కూడా బయటపెట్టాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయింది ఆ బాలిక. తన తల్లి పిలుస్తోంది అంటూ చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీశారు. అయితే అతని కుటుంబం మాత్రం ఇక ఈ ఆరోపణను ఖండించడం తో చివరికి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితుడు మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయం తేలింది పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి