గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యతకు ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు జనాభా పెంచడం అవసరమని ప్రభుత్వమే గుర్తించిందని, ఆంధ్రాలో సంతానోత్పత్తి రేటు1.5 % పడిపోయిందని.. సుస్థిర అభివృద్ధికి 2.1 శాతం వరకు ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23 శాతానికి చేరుతుందని ఇది ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన భారాన్ని చూపుతుందంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. అందుకే ఎక్కువ పిల్లలు కనే తల్లులకు కాన్పులు రూ .25వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటుగా, రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒక నెల, మూడో బిడ్డ పుడితే రెండు నెలలు పెయిడ్ లీవ్ మంజూరు చేస్తామంటూ తెలిపారు. అలాగే పిల్లల చదువు కోసం , వారి పోషణ కోసం ఐదేళ్లపాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సహాయము అలాగే 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామంటూ తెలియజేశారు.
ముగ్గురు కంటే ఎక్కువ కంటే.. 12 నెలల పేరెంట్ లీవ్, తల్లిదండ్రులకు రెండు నెలల పేరెంట్ లీవ్ ఇస్తామంటూ తెలిపారు. అలాగే ఆరోగ్య నిధి కింద రూ .50 వేల రూపాయల వరకు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో జనాభా తగ్గుదల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. జనాభా నిర్వహణ విషయంలో దేశంలోనే ఏపీ ఒక రోల్ మోడల్ గా నిలవాలని తెలియజేశారు చంద్రబాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి