మైనర్ బాలికల పై జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కడ తగ్గు ముఖం పట్టడం లేదు అనే చెప్పాలి. రోజుకి వెలుగు లోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. ఇక ప్రేమ పేరుతో ఎంతో మంది మైనర్ బాలికలను టార్గెట్గా చేసుకొని చివరికి లైంగిక వాంఛలు తీర్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువై పోతుంది. ఈ క్రమం లోనే నిజాంబాద్ జిల్లాలో సఖి సెంటర్ లో చేరిన ఎనిమిది మంది మహిళలు బాలికలు గర్భం దాల్చినట్లు నిజం బయట పడటం మాత్రం సంచలనంగా మారిపోయింది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ వెల్లడించింది.



 నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో మైనర్ బాలికలపై అత్యాచార ఘటన జరిగినట్లు మహిళా కమిషన్ వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలికల టార్గెట్గా చేసుకుంటూ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్ప డుతున్నారు అన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో ఉన్న ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సైతం గర్భం దాల్చడం కలకలం రేపింది. ఇక ఖమ్మం జిల్లా దమ్ము గూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ పాఠశాలలో కూడా పదో తరగతి చదువుతున్న ఓ బాలిక గర్భం దాల్చింది. ఇక తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపంతో బాలిక బలవన్మరణానికి పాల్పడింది.


 ఇక మరోవైపు రెండు రోజుల క్రితమే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం లో పదవ తరగతి చదువుతున్న బాలిక ప్రేమ పేరుతో మోసపోయింది. ఇక లైంగిక వాంఛలు తీర్చుకున్న యువకుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. చివరికి ప్రియుడి దాడిలో నే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలల విద్యార్థులు గర్భందాల్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చేవచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: