ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మూడు ముళ్ల బంధానికి విలువ ఇవ్వకుండా కట్టుకున్న వారిని హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మరి కొంతమంది ఏకంగా ప్రేమిస్తున్నాను అని నటిస్తూ ఏకంగా కట్టుకున్న భార్యను హత్య చేసిన ఘటనలు కూడా సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత వధూవరులు షాపింగ్ కి వెళ్తారు అన్న విషయం తెలిసిందే.


 అలా షాపింగ్ వెళ్లడమే సదరు యువకుడు పాలిట శాపంగా మారి పోయింది  ఎందుకంటే ఏకంగా కట్టుకున్న వాడి కళ్ళకు గంతలు కట్టిన అతని గొంతు దారుణంగా కోసి చంపడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇది ఎక్కడో కాదు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడి లో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని చివరికి అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇక కాస్త వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల మండలం ఘాట్రోడ్డు కు చెందిన  రామానాయుడు రావికమతం గ్రామానికి చెందిన బియ్యపు పుష్ప కి నిశ్చితార్థం జరిగింది.


 కాగా మే 20వ తేదీన వీరిద్దరికి కూడా వివాహం జరగాల్సి ఉంది. అయితే మే 25 వ తేదీన వీడియో వివాహ నేపథ్యంలో ఇక వధూవరులు ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్ళారు. షాపింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో కొమ్మలపూడి చివరిలో బాబా ఆశ్రమం అంతా కాసేపు సరదాగా గడుపుదామని చెప్పి రామానాయుడు కళ్ళకు పుష్ప గంతలు కట్టి తీసుకెళ్ళింది యువతీ   అయితే కాసేపు అలా సరదాగా గడిపిన సమయం లో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పుష్ప రామానాయుడు గొంతు కోసి అనంతరం ఏమీ తెలియనట్టు  యువకుడిని ప్రాథమిక ఆరోగ్య చికిత్సకి తీసుకు వచ్చింది  ఆ తర్వాత గొంతుకు ఏదో గుచ్చుకుంది అంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక యువకుడు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అనకాపల్లి లో అన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: