మనుషుల్లో మానవత్వం కాస్త కూస్తో ఇంకా బ్రతికే ఉంది అనుకున్న ప్రతిసారి కూడా ఇలాంటి భావన ముమ్మాటికీ తప్పే.. మనుషుల్లో అసలు మానవత్వమే లేదు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇక ఇప్పుడు అడవుల్లో ఉండే కూర మృగాల కంటే ప్రమాదకరంగా మారిపోయారు అనే నిరూపించే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు సాటి మనుషులపై ఉన్న నమ్మకాన్ని.. ప్రేమ ఆప్యాయతలను కూడా మంటగలిపే విధంగా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో నా అనుకున్న వాళ్ళే అతి కిరాతకంగా హత్య చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్.


 దీంతో సొంత వారి నుంచే రక్షణ లేకపోతే ఇక మనిషికి పరాయి వ్యక్తుల నుంచి రక్షణ ఎక్కడిది అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు మనిషిలో పేరుకుపోయిన రాక్షసత్వం ఏ రేంజ్ లో ఉంది అన్న విషయాన్ని నిదర్శనం గా మారిపోతున్నాయి. ఇక ఇలా ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు సాటి మనుషులు. అది కూడా చిన్నచిన్న కారణాలకే ఇలా ప్రాణాలు తీసేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల మహారాష్ట్రలో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.


 ఇటీవలే మహారాష్ట్రలోని పూనే సమీపంలో ఉన్న భీమా నదిలో ఏకంగా ఏడు మృతదేహాలు లభ్యం అయిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓకే కుటుంబానికి చెందిన మృతదేహాలు అని పోలీసులు గుర్తించారు. ఇక ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సంచలన నిజం బయటపడింది. ఈ కుటుంబ సభ్యులను హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అన్నది దర్యాప్తులో తేలింది. కొన్ని నెలల క్రితం ప్రధాన నిందితుడు అశోక్ పవర్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. ఇందుకు మోహన్ కుటుంబాన్ని బాధ్యులను చేస్తూ ఇక దారుణంగా కుటుంబ సభ్యులందరిని చంపి నదిలో పడేసినట్లు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: