ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం అనేది కాస్తయినా గ్యారెంటీ లేని విధంగా మారిపోయింది అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో ఊహించని ప్రమాదాలు దూసుకు వచ్చి ఎంతోమంది ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. కేవలం రెప్పపాటు కాలంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు అందరికీ భయాందోళనలు కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇక ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తు ఇక కొంతమంది మాత్రం ప్రాణాలు పోతాయేమో అనుకునేంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలనుంచి కూడా రెప్పపాటు కాలంలో చిన్న చిన్న గాయాలతో బయటపడడం లాంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి అని చెప్పాలి.ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగు చూసింది.  ఓ మహిళ ఏకంగా స్కూల్ బస్సులో హెల్పర్ గా పనిచేస్తుంది. అయితే రద్దీగా ఉన్న రోడ్డుపై చిన్నారిని దాటించే ప్రయత్నం చేసింది.


 ఇంతలో ఊహించని ప్రమాదం ఏకంగా ఆమె ప్రాణాలు తీసినంత పని చేసింది అని చెప్పాలి. రద్దీగా  ఉన్న రోడ్డుపై అంబిలి అనే మహిళ చిన్నారిని రోడ్డు దాటించే సమయంలో బస్సు ఆమెను ఢీకొట్టింది. ఇక డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. అయితే అదృష్టవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపై నుంచి వెళ్లలేదు. అయితే జుట్టు మాత్రం చక్రంలో ఇలుక్కుపోయింది. ఇక స్థానికులు అక్కడికి చేరుకొని మహిళకు సహాయం చేశారు అని చెప్పాలి. వెంటనే స్థానికంగా ఉన్న ఒక బార్బర్ ను పిలిపించి బస్సు చక్రంలో ఇరుక్కుపోయిన మహిళా జుట్టును కత్తిరించారు  అయితే ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి అన్నది తెలుస్తుంది. ఇక తాను బతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నా అంటూ ఆనందంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి: