
అయితే తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు అవకాశం ఉంటుందని.. లక్షలు కాదు కోట్ల రూపాయలను కొల్లగొట్టవచ్చు అని ఎన్నో బెట్టింగ్ యాప్స్ ఇటీవల కాలంలో తమ ప్రకటనల ద్వారా ఎంతో మంది యువకులను వలలో వేసుకుంటున్నయ్. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించాలి అనుకునేవారు చివరికి బెట్టింగ్ యాప్స్ మాయలో పడిపోతున్నారు. చివరికి అప్పులు చేసి మరి బెట్టింగ్ పెడుతూ ఉన్నది మొత్తం పోగొట్టుకుంటున్నారు. దీంతో చివరికి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి..
ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్స్ కి అలవాటు పడిన ఒక యువకుడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి మామిడిపల్లి కి చెందిన 28 ఏళ్ల రాజశేఖర్ గా గుర్తించారు. హైదరాబాద్ లోని ఎయిర్పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.