ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎక్కువ అయి పోయింది. కేవలం ఒక దేశం లో మాత్రమే ఇలాంటిది కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కూడా ఇలా చోరీల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బయటకు వెళ్లిన సమయం లో ఏ మాత్రం అప్రమత్తం గా లేకపోయినా అందిన కాడికి దోచుకు పోవడానికి పక్కనే మంచి వాళ్ళలా నటిస్తున్న జనాలు సిద్ధంగా ఉంటున్నారు అని చెప్పాలి. దీంతో బయటకు వెళ్ళినప్పుడు ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది అని చెప్పాలి.


 అయితే మనం ఏం చేసినా కూడా దానికి కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఇన్స్టెంట్ కర్మ రూపం లో కొంతమంది తప్పు చేసిన వెంటనే ఫలితం అనుభవిస్తూ ఉంటారు అన్నదానికి నిదర్శనంగా కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ సెల్ఫోన్ చోరీ చేసిన దొంగ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. మహిళ చేతిలోంచి సెల్ఫోన్ దొంగలించిన యువకుడికి చేదు అనుభవం ఎదురయింది.


 ఒక మహిళ రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ పాత్ పై నిలబడి ఫోను చూస్తూ ఉంది. ఇలాంటి సమయంలోనే సైకిలిస్ట్ ఆమెను దాటుకుంటూ ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు వచ్చి అతన్ని ఢీకొట్టింది. అతను పడిపోయాడు. కానీ ఇక దొరక్కుండా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో మరో యువకుడు అతన్ని అడ్డుకున్నాడు. సినిమా స్టైల్ లో చేజింగ్ చేసి మరి ఎట్టకేలకు సెల్ఫోన్ దొంగను పట్టుకుని చితకబాదారు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇది చూసి కర్మ ఫలితం అంటే ఇదేనేమో అని నెటిజన్స్ కామానికి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: