ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్స్ అన్నీ దాదాపు పూర్తయ్యాయి. మూవీ మేకర్స్ త్వరలోనే మిగిలిన షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసి, ఆల్మోస్ట్ ఆల్ షూట్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ సినిమా ఇంకా పూర్తికాకముందే బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, బుచ్చిబాబు తన తదుపరి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోతున్నాడట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసే స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా సుమారు తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆ సినిమా పూర్తయ్యాక, అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడని టాక్. అయితే నిజానికి అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో సినిమా ఫిక్స్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడట. కానీ వరుసగా తమిళ దర్శకులకు అవకాశాలు ఇస్తే తన టాలీవుడ్ ఇమేజ్‌కు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అన్న ఆలోచనతో బన్నీ ఒక యూటర్న్ తీసుకున్నాడని తెలుస్తోంది. అదే కారణంగా ఆ ఛాన్స్‌ను బుచ్చిబాబు సనాకు ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు ఈ కాంబోపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా ట్రెండ్ అవుతోంది. నిజంగా ఈ కాంబో కనుక ఫిక్స్ అయితే, టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. చూడాలి మరి… బుచ్చిబాబు – అల్లు అర్జున్ కాంబో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో, ఈ వార్తలు ఎంతవరకు నిజమో, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అనేది. అప్పటివరకు ఈ పూనకాలు తెప్పించే కాంబోపై ఆసక్తి మాత్రం ఆగేలా లేదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి