
ఇక్కడ ఒక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఏకంగా 25 ఏళ్ల అమ్మాయికి ఇటీవల పెళ్లయింది. అయితే పెళ్లయిన కొన్ని రోజులకే ఆ అమ్మాయి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. ఏకంగా జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అనుకున్న భర్త చివరికి ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పుట్టింటికి వెళ్లలేక భర్తలేని మెట్టినింట్లో ఉండలేక ఆమె తీవ్ర మనోవేదనను అనుభవించింది. అయితే ఇక కోడలి మనోవేదనను అర్థం చేసుకున్న మామ చివరికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలా ఇటీవల ఏకంగా కోడలితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు మామ. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటన ఢిల్లీలో జరిగింది అన్నది తెలుస్తుంది. అయితే 45 ఏళ్ల వ్యక్తి కుమారుడు మరణించడంతో వితంతువైన కుమారుడు భార్యతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం 20 ఏళ్లు ఉండటం గమనార్హం. అయితే ఇక ఇలా పెళ్లి చేసుకొని బయటికి వస్తున్న ఈ జంటను అడ్డగించిన రిపోర్టర్లు ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే తమ ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నట్లు వారిద్దరు స్పష్టం చేశారు. అయితే ఈ వీడియో చూసి వీరి పెళ్లిని నేటిజన్స్ కూడా సమర్థిస్తున్నారు. వాళ్ళిద్దరూ మేజర్లు.. ఇక వాళ్లకి వెనక ముందు ఎవరూ లేరు అని వారి మాటల్లో అర్థం అవుతుంది. పెళ్లి చేసుకుంటే తప్పేముంది . వాళ్లకి లేని బాధ రిపోర్టర్లకు ఎందుకు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.