భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది పునాది లాంటిది అన్న విషయం తెలిసిందే. ఆ నమ్మకమే లేనప్పుడు సంతోషకరమైన భార్యాభర్తల బంధం కాస్త నరకప్రాయంగా మారిపోతూ ఉంటుంది. దీంతో ఒకరికి ఒకరు కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలు.. చివరికి బద్ద శత్రువులుగా మారిపోయి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో అయితే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ తలెత్తినప్పుడు  సర్దుకుపోయి బ్రతకడం కంటే ఈగోలకు పోయి దారుణాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఇంకొంతమంది భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఆ కోపాన్ని మొత్తం పిల్లల మీద చూపించి ప్రాణాలు తీస్తున్న దారుణమైన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా భార్య మీద కోపం కారణంగా ముక్కుపచ్చలారని శిశువు ప్రాణం తీయాలనుకున్నాడు. దీనికంతటికి కారణం భార్యపై భర్తకు ఉన్న అనుమానమే. భార్యకు వివాహేతర సంబంధం ఉంది అన్న అనుమానంతో 20 రోజుల క్రితం జన్మించిన బిడ్డకు ఒక తండ్రి విషం ఎక్కించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతుంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ లో జరిగింది.


 చందన్ అనే వ్యక్తికి తన్మయ్ అనే యువతీతో ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికీ మే 9వ తేదీన ఆడపిల్ల జన్మించింది. అయితే తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. అతని వల్లే గర్భం దాల్చిందని.. అనుమానించడం మొదలు పెట్టాడు . ఇక ఇటీవల పుట్టిన బిడ్డపై కూడా కోపం పెంచుకున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆమె పుట్టింటికి వెళ్ళింది. భార్యాబిడ్డలను చూసేందుకు అక్కడికి వెళ్లిన చందన్ భార్య లేని సమయంలో పురుగుల మందును సిరంజి ద్వారా చిన్నారి శరీరంలోకి ఎక్కించాడు. ఒక్కసారిగా శిశువు ఏడుపు మొదలు పెట్టింది. పక్క గదిలో ఉన్న తల్లి వచ్చి చూసేసరికి చందన్ చేతిలో సిరంజి ఆ పక్కనే పురుగుల మందు  కనిపించాయ్. దీంతో నిలదీయగా తానేం చేయలేదు అంటూ బుఖాయించాడు. అనుమానం వచ్చి ఇక చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: