మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వరసగా మూడుసార్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. కానీ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోయింది. అప్పుడు ఓట్లు 1% ఎక్కువ వచ్చిన కూడా 7, 8 సీట్ల తేడాలో  కరెక్ట్ గా 5 సంవత్సరాల క్రితం అక్కడ భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సింధియా కి, అప్పుడున్న ముఖ్యమంత్రికి గొడవలు రావడంతో ఒక 25మంది ఎమ్మెల్యేలతో సింధియా బయటకు వచ్చేయడం, ఆ పార్టీ కుప్పకూలడం జరిగిపోయాయట.


అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అందరి తోటి రాజీనామాలు చేయించింది. అప్పుడు ఎన్నికల్లో 19 మంది దాకా గెలిస్తే ఆరుగురు ఓడిపోయారట. మరొకసారి  శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. సింధియా అయితే జాతీయ నాయకత్వంలో విమానయాన శాఖలో కేంద్ర పదవిని చేపట్టారు. ఇలా సింధియా తో కొత్త రక్తం తోడైంది, ఇక ఊపు అంటుకుంటుంది అక్కడ భారతీయ జనతా పార్టీ అనుకునే సమయంలో కాంగ్రెస్ వల్ల దానికి ఒక చిక్కు వచ్చింది.


కాంగ్రెస్ పార్టీ సహకారం తో అక్కడ ఒక కొత్త పార్టీ ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అదే భీమ్ ఆర్మీ పార్టీ అనేది. ఇప్పుడు కాంగ్రెస్ ని దెబ్బతీస్తుందో, బిజెపిని దెబ్బతీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది అక్కడ. అయితే ఈ భీమ్ ఆర్మీ అనే సంస్థ వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. కర్ణాటక తర్వాత కాంగ్రెస్ పార్టీ తన కేడర్ అంతా మధ్యప్రదేశ్ కు చేరుస్తున్న సమయంలో భీమ్ ఆర్మీ అక్కడ పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. భీమ్ ఆర్మీ సమాజ్వాది పార్టీ, జై ఆదివాసి, యువశక్తి పార్టీలతో కలిసి పోటీ చేయబోతుందట. ఈ మూడు పార్టీల తో కలిసి ఒక నాలుగు నుండి ఐదు శాతం ఓట్లను సాధించే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: