అమెరికా చెప్పినట్లు వినేది ఐక్య రాజ్య సమితి అని చాలా మంది విమర్శిస్తుంటారు. అగ్ర రాజ్య ఆదేశాల మేరకు నడుచుకుంటుదందనే ఆరోపణలు ఉన్నాయి. భారత్ కు అనుకూలంగా ఉండదు. మిగతా దేశాలకు కూడా ఏ రోజు అనుకూలంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం న్యూట్రల్ మాట ఐక్య రాజ్య సమితి నోట వినిపిస్తుంది. మొన్నటి వరకు అమెరికా ఏదీ చెబితే అది మాట్లాడే ఐక్య రాజ్య సమితి ఇప్పుడు కాస్త దారి కొచ్చినట్లు కనిపిస్తోంది.


రష్యా బలంగా తయారు కావడం, దాని వెనక చైనా, ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలు ఉండటం, అమెరికా సాయం చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్ ఇంకా యుద్దంలో గెలవకపోవడం లాంటి విషయాలు ఐక్య రాజ్య సమితిలో ఏమైనా మార్పులు తీసుకొచ్చాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐరాస కీలకమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. రష్యాలో ని బెల్ గ్రేడ్ లో వేరే దేశం వెళ్లి అక్కడ విధ్వంసం చేయాలని చూడటం చాలా దారుణమని రష్యాకు అనుకూలంగా మాట్లాడింది.


దాదాపు 100 మంది చొరబాటు దారులు బెల్ గ్రెడ్ నగరంలోకి చొచ్చుకువెళ్లి అక్కడ దాడి చేయాలని ప్రయత్నించారు. దీంతో రష్యా సైన్యం దాదాపు 70 మందిని కాల్చి చంపేసింది. అయితే స్వతంత్రంగా బతికే ఒక దేశంలో మరో దేశం వచ్చి చొరబడి విధ్వంసం సృష్టించడమంటే అది పొరపాటే అవుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే అక్కడ జరిగిన దాడిలో దొరికిన ఆయుధాలు అన్ని అమెరికా లో తయారు చేయబడి ఆ దేశం వాడుతున్నవే కావడం.


దీంతో రష్యా అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ఐక్య రాజ్య సమితి రష్యా కు అనుకూలంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఐక్య రాజ్య సమితి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA