నిన్నటి వార్త రేపటికి చద్ది వార్త అన్నది జర్నలిజం ఉన్న వారు అందరికీ తెలిసిందే. వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆర్ కె కొత్త పలుకు లో ఆర్కే కొత్త విషయాలు రాసుకొచ్చారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడే వైఎస్ వివేకా హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆర్.కె కొత్త పలుకులో కొన్ని విషయాలను రాసుకొచ్చారు. ఆర్టికల్ రాయడం విశ్లేషణ చేయడం ఆయనకు తెలిసిన విషయమే. అయితే ఎన్నికలకు ముందు ఆర్ కె కొత్త పలుకులో రాసిన విషయం ఏమిటంటే 2010లో వైఎస్ వివేకా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు.


అతని రెండో భార్య సాప్ట్ వేర్ గా పని చేస్తోంది. వివేకా రెండో భార్య కడపకు చెందిన వారు. అయితే వైఎస్ వివేకా చనిపోయే రోజు ముందు సమీరా అనే మహిళ నుంచి అర్ధరాత్రి 1.52 నిమిషాలకు ఒక మేసేజ్ వచ్చింది. నీ కుతూరు వల్ల మేం చాలా నష్టపోయాం. ఇందుకు తగిన శిక్ష అనుభవిస్తావు అని ఉంది. దేవుడున్నాడు అనే సందేశం వచ్చింది. హత్య జరిగిన రోజు ఉదయం 5.30 నుంచి 6.00 గంటల మధ్య వివేకా బామ్మర్ది శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు  పీఏ కృష్ణారెడ్డి బెడ్ రూంలో రక్తపు మరకలు కడిగేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రీజర్ ను కూడా శివప్రసాద్ రెడ్డి చెప్పారు.


శివప్రసాద్ రెడ్డితో వైఎస్ అవినాశ్ రెడ్డి అనేక సార్లు ఆ రోజు ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. మధ్యాహ్నం వరకు కేసును తప్పదోవ పట్టించి సాయంత్రం వరకల్లా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిందలు వేసేందుకు ముందుకు రావడం ఏమిటని రాసుకొచ్చారు. ఇన్ని విషయాలు తెలిసినట్లు ఆనాడు రాసిన ఆర్ కె ను సీబీఐ ఎందుకు విచారించడం లేదని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: