తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కుమారుడు, డీఎంకే నేత అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న విషయం తెలిసిందే. హిందూ మతాన్ని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని రోగాలతో పోల్చడం ప్రత్యేకించి హిందువులను బాగా కలిచివేసింది. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని దానిని కేవలం వ్యతిరేకించడం మాత్రమే కాకుండా పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి అన్నారు.


ఇలా  ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారమే రేగింది. రాజకీయ నేతలు మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ఆయనను దుయ్యెత్తి పోశారు. మద్రాస్ హైకోర్టు కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. భావ ప్రకటన అనేది విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని కోర్టు తేల్చి చెప్పింది. సనాతన ధర్మం అంటరానితనాన్ని ఎక్కడ ప్రోత్సహించలేదని కోర్టు చెప్పింది.


హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళందరినీ సమానంగా  చూడాలని మాత్రమే సనాతన ధర్మం చెప్తుందని కోర్టు చెప్పింది. మోడీ కూడా ఇది హిందూ మతంపై దాడి అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అంతం చేయడమే ఐ ఎన్ డి ఐ ఏ కూటమి లక్ష్యం అని ఆయన అన్నారు. అది ఒక గమండీ అహంకారంతో కూడిన కూటమి అని ఆయన అన్నారు.  వేల ఏళ్ళనాటి బానిస కాలంలోకి దేశాన్ని నెట్టేయాలని వీళ్లు భావిస్తున్నారని ఆయన అన్నారు.


మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో బహిరంగ సభల్లో ఇటీవల పాల్గొన్న ఆయన  ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై  విరుచుకుపడ్డారు. వేల ఏళ్ళ నాటి ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని తుడిచి పెట్టేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో వరుస ఓటములను చూసినవాళ్లు ప్రజలపై తమ విద్వేషాన్ని చిమ్ముతున్నారంటూ ఆయన అన్నారు. మహాత్మా గాంధీ సనాతన ధర్మం నుండి స్ఫూర్తి పొంది చనిపోయేటప్పుడు కూడా హేరామ్ అంటూ తన తుది శ్వాసను విడిచారని ఆయన గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: