
ఇటీవల తెలంగాణ నుంచి అరబ్ వెళ్లిన నలుగురు వలస కూలీలు హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్లను విడిపించాలంటే వారు ఏ హత్య కేసులో నిందితులుగా ఉన్నారో గుర్తించి ఆ బాధిత కుటుంబ సభ్యులను కలసి మాట్లాడాలి. వారికి పరిహారం ఇచ్చి క్షమాభిక్ష పత్రం రాసేలా చూడాలి. అయితే బాధిత నేపాల్ దేశస్థులను గుర్తించి వారికి పరిహారం అందేలా చూసి శిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించేలా మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. ఆ కేసు ఏమైందో ఇంకా తేలలేదు.
ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. ఇటీవల మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ పర్యటనలో ఆ అంశం గురించి మాట్లాడి వచ్చిన నేపథ్యంలో 17 ఏళ్ల జైలు జీవితం తర్వాత దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టింది ఒక్కరికే. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు పేటకు చెందిన లక్ష్మణ్ త్వరలో విడుదల కాబోతున్నారు. మరో నలుగురు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.
అ అంశం గురించి ఏంబీసీ అధికారులతో మనవ వాళ్లు చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరోసారి తెలంగాణ ప్రభుత్వం నుంచి వారికి మెయిల్ వెళ్లింది. 17 ఏళ్ల క్రితం శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్న వారి కోసం మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కుతోంది.