అధికారంలోకి రావాలంటే ఆకర్షించే హామీలు తప్పనిసరి.  ఓ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేనివి అని ప్రచారం చేస్తే జనం ఒప్పుకోరు. నువ్వు చేయాలనే వారు కోరుకుంటారు. చేయలేకపోతే అడుగుతారు. 2014, 19లోను టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. 2014లో ఆ హామీని విస్మరించి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రుణమాఫీ చేస్తున్నారు.


ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్ కార్వనిర్వాహక అధ్యక్షుడు స్పందిస్తూ రాబంధుల రాజ్యం వస్తే రైతుబంధు రద్దవడం ఖాయమని ఎక్స్ లో పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ సంక్షేమంపై దృష్టి సారించారు. సాగునీటి వనరులు అభివృద్ధి చెందాయి. రైతు బంధు ద్వారా రైతాంగానికి మేలు చేకూరుతుంది. దళితబంధు, బీసీ బంధు వంటి ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నారు.


ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత ఎన్నికల్లో మీరేం చేస్తారో చెప్పాలి కానీ అవతలి వాళ్లు చేయరు అని ప్రచారం చేస్తున్నారు. వాళ్లు చేయలేరని వీళ్లు ఎలా చెబుతారు అనేది ఇక్కడ ప్రశ్న.  దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణదే అని చెబుతున్నప్పుడు.. ఆదాయ వనరులు పెరిగినప్పుడు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ హామీలిచ్చినప్పుడు చేయలేదు అని చెప్పడానికి ఏ కారణం లేదు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కాకపోతే సంపాదన ఒకరిది. ఖర్చు మరొకరది అవుతుంది.


గతంలో బీజేపీ ప్రభుత్వం అటల్ బిహర్ వాజ్‌పేయి హయాంలో సంపాదించి పెడితే వాటన్నింటిని సక్రమంగా ఖర్చు పెడుతూ రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది.  కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని సొమ్ము చేసుకంది బీజేపీ.  గతంలో వైఎస్సార్, చంద్రబాబు హయాంలో పెరిగిన ఆదాయ వనరులను మా ఘనతే అని చెప్పుకొని ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్. ఇదంతా వాస్తవమే అయినా రూపాయి ఉన్న వారి దగ్గరకు రూపాయి మళ్లీ వస్తోంది కానీ పేదవాడి దగ్గరకి మాత్రం రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: