
రాష్ట్రంలో 25అసెంబ్లీ, 4పార్లమెంట్ స్థానాల్లో సిపిఎం పోటీ చేయబోతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. ఇక రాబోయే ఎలక్షన్లలో మంగళగిరిలో కూడా సిపిఎం పోటీ చేయబోతుందని ఆయన అన్నారు. ప్రజల్లో బలాన్ని పెంచుకోవడంతో పాటు, ఉద్యమ శక్తులను కాపాడుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. టీడీపీ అలాగే వైసీపీ బీజేపీకి లొంగి ఉంటున్నాయని ఆయన అన్నారు.
జనసేన పార్టీ ఎన్డీఏతో కలిసి ఉంటానని చెప్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళడానికి ఎందుకు సమ్మతిస్తుందో తెలియడం లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ లో బిజెపిపై అవిశ్వాస తీర్మానం ఉన్న పార్టీలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి వాళ్లు ఎలా మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ఆయన అన్నారు. నువ్వు స్వతంత్రంగా ఉంటే నీ బలాన్ని నువ్వు పెంచుకుంటే అవతల వ్యక్తి కూడా నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తాడు.
అంతే గాని అవతల వాళ్ళ కోసం నీ బలాన్ని పక్కన పెట్టి, వాళ్ళ దగ్గర నీ బలాన్ని నీ శక్తిని తాకట్టు పెట్టుకోవాలనుకుంటే నువ్వు బలహీనమైపోతావ్. ఇప్పుడు సిపిఐ చేసే పని అదే. కానీ సిపిఎం మాత్రం తన బలాన్ని తాను నమ్ముకుని ముందుకు వెళుతుంది. తనకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి మంగళగిరిలో తన బలాన్ని నమ్ముకుని ముందుకు వెళుతుంది సిపిఎం. ఒకరకంగా సిపిఎం చేసే ధైర్యమే దానికి శ్రీరామ రక్ష.