ఎన్నికల మ్యానిఫెస్టోలు గత ఎన్నికల నుంచి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో అయితే వీటిని ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం పెరిగింది. పైగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏదైనా ఇంటర్ నెట్ లో క్షణాల్లో దొరుకుతుంది. దీంతో ఎన్నికల ముందు రాజకీయ నాయకుల హామీలను గుర్తు చేస్తూ ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కరంగా మారింది.


ముందు అధికారంలోకి వస్తే.. ఆ తర్వాత హామీలు సంగతి చూద్దాం అని రాజకీయ నాయకులు అనుకుంటున్నా.. ఓటర్లు మాత్రం పక్కా లెక్కలతో ఉంటున్నారు. ప్రస్తుతం విశ్వసనీయతకే పెద్ద పీట వేస్తున్నారు. ఒకప్పుడు బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్న జగన్ ను చూసి రాష్ట్రం శ్రీలంక లా తయారవుతుంది అని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీని మించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఆర్ధిక పరిస్థితి ఏం అవుతుంది అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.


వైసీపీ నవరత్నాలు అమలు చేయడానికే రూ.75 వేల కోట్ల అవసరం పడుతున్నాయి. టీడీపీవి అమలు చేయాలంటే రూ.1.50లక్షల కోట్లు అవసరం. మరి ఈ నిధులను ఎక్కడి నుంచి తెస్తారు అని సగటు ఏపీ ఓటరు మదిని తొలిచివేస్తున్న ప్రశ్న. సంపదను ఎలా సృష్టించాలో నాకు తెలుసు అంటూ చంద్రబాబు గొప్పులు చెప్పుకున్నా.. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమంతా గొప్పగా లేదు.


పైగా మన దగ్గర 80శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. మహా నగరాలు లేవు. ఉన్నంతలో విశాఖ.. ఆతర్వాత విజయవాడ. ఈ లెక్కన సేవా రంగం అభివృద్ధి చెందాలన్నా పదేళ్ల వరకు సమయం పడుతుంది. మరి టీడీపీ పథకాలు అమలు చేయాలంటే డే వన్ నుంచే డబ్బులు పంచి పెడుతూ ఉండాలి. వైసీపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక స్థితి గతులు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. కేవలం ఓట్లు దండుకోవడానికే ఈ మ్యానిఫెస్టో అని ఆచరణ సాధ్యం కాదని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: