రాజకీయాల్లో ప్రతిసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. లెక్కలో 1+1= 2 అవుతాయని అందరికీ తెలిసిందే. కానీ రాజకీయాల్లో 1+1= 0 కూడా అవుతుంది ఒక్కోసారి. అదే రాజకీయాల్లో ఉన్న  గొప్పదనం. ఇప్పుడిదంతా ఎందుకంటే 2019 ఎన్నికల్లో అన్నీ ఈక్వేషన్లు వేసుకుని చంద్రబాబు ఒంటిరిగా పోటి చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. అదే ముందునుండి ఎవరితోను తమకు పొత్తు ఉండదని మొండిగా చెప్పిన జగన్ 151 సీట్ల బంంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చాడు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చాడు. అప్పటి నుండి చంద్రబాబు ఎంతగా యాగీ చేస్తున్నాడో, ఎల్లోమీడియాతో జగన్ పై ఎంతగా బురద చల్లిస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఎంత వీలుంటే అంతా ఉద్యమాల పేరుతో కొందరు రైతులను, మరికొందరు పెయిడ్ ఆర్టిస్టులను రెచ్చగొడుతునే ఉన్నాడు. తాజాగా మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాత  రెచ్చగొట్టే కార్యక్రమాన్ని బాహాటంగానే చంద్రబాబు చేస్తున్నాడు.



ఇక్కడే జగన్ వేసిన ట్రాప్ లో చంద్రబాబు పూర్తిగా ఇరుక్కుపోయాడనే అర్ధమవుతోంది. రాయలసీమలో హైకోర్టు అన్నది దశాబ్దాల డిమాండ్. ఇక ఉత్తరాంధ్రలోని వైజాగ్ ప్రాంతంలో రాజధాని అన్నది  పూర్తిగా జగన్ కొత్త వ్యూహమే. శాసన రాజధానిగా అమరావతి కంటిన్యు అవుతుందని జగన్ ప్రకటన చేశాడు. నిజానికి రాజధానిగా వైజాగ్ ను ఎంపిక చేయటంలో జగన్ చాలా వ్యూహత్మకంగానే వ్యవహరించాడు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ టిడిపి తలెత్తకుండా ఉండాలంటే గట్టిగా ప్లాన్ చేయాలన్నదే జగన్ ఆలోచన. అందుకనే అన్నీరకాలుగా ఆలోచించే వైజాగ్ ను రాజధానిగా జగన్ ప్రకటించాడు. జగన్ ఆలోచనను ముందు అర్ధం చేసుకోవటంలో ఫెయిల్ అయిన చంద్రబాబు అమరావతి కోసమే ఉద్యమాలు లేవదీశాడు.




వైజాగ్, కర్నూలుకు వ్యతరిరేకంగా పార్టీలో తీర్మానాలు చేయించటమే కాకుండా రాష్ట్ర మంతా ఉద్యమం పేరుతో పర్యటించాడు. సరే కరోనా వైరస్ కారణంగా పర్యటనలు, ఉద్యమాలు అర్ధాంతంగా ఆగిపోయాయి. అమరావతి నుండి రాజధానిని తరలించాలనే ప్రకటనకు ముందే  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భవిష్యత్తులో వైసిపి పరిస్ధితి ఏమిటి ? అనే విషయాలపై జగన్ పెద్ద ఎత్తున కసరత్తు చేశాడు. రెండు జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాలపై ఆశలు వదిలేసుకున్నాడు.  మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు వ్యతరికేత కారణంగా వైసిపికి పై రెండు జిల్లాల్లో కూడా అత్యధిక సీట్లు వచ్చాయి. అయితే 2024లో కూడా ఇన్నే సీట్లు వస్తాయన్న గ్యారెంటీ ఏమీలేదు.  అందుకనే ప్లాన్ బిని అమలు చేశాడు.




ప్లాన్ బిలో భాగంగానే రాజధానిని వైజాగ్ తీసుకెళ్ళిపోవటం. ప్లాన్ బిని అమలు చేయటంలోనే చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించేశాడు జగన్. కారణాలేవైనా కానీండి చంద్రబాబేమో పై రెండు జిల్లాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి కోసం ఉద్యమాలు చేస్తున్నాడు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, హైకోర్టు కూడా కర్నూలుకు తరలించేందుకు వీల్లేదని ఉద్యమాలు చేయటంతో పై ప్రాంతాల్లో చంద్రబాబు విలన్ అయిపోయాడు.  అంటే రెండు జిల్లాల కోసం చంద్రబాబు 11 జిల్లాలోని జనాలతో సున్నం పెట్టుకున్నాడు. అదే సమయంలో  రెండు జిల్లాలను వదులుకునేందుకు రెడీ అవటం ద్వారా  జగన్ 11 జిల్లాల్లో మంచి మార్కులు  సంపాదించుకున్నాడు.  అంటే మిగిలిన నాలుగేళ్ళల్లో జగన్ మార్క్ పాలన ద్వారా వైజాగ్ లో రాజధాని పెట్టడం ద్వారా అభివృద్ధిని చూపించగలగాలి. అదే సమయంలో  హైకోర్టు పెట్టడం ద్వారా  యావత్ రాయలసీమను కూడా డెవలప్ చేయాలి.




తన వ్యూహం ద్వారా మెజారిటి జిల్లాల ప్రజలను మెప్పించగలిగితే జగన్ కు తిరుగులేదనే చెప్పాలి. అంటే 11 జిల్లాలను వదులుకుని చంద్రబాబు రెండు జిల్లాలకే పరిమితం అయిపోయాడు. అదే సమయంలో  రెండు జిల్లాలను వదులుకోవటానికి రెడీ అయిపోయి 11 జిల్లాల్లో శాశ్వత పీఠం వేసుకోవటానికి వ్యూహం పన్నాడు. జగన్ పాలన మెచ్చుకోదగని స్ధాయిలో ఉంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా జనాలు జగన్నే ఆదరిస్తారనటంలో సందేహం లేదు. మరి ఇద్దరిలో ఎవరు తెలివైన వాడు, ఎవరి వ్యూహంలో ఎవరు ఇరుక్కున్నట్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి: