రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నరేంద్రమోడికి మంచి క్లారిటినే ఉన్నట్లుంది. ఏ విషయంలో కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించకూడదన్న విషయంలో మోడి బాగా స్పష్టతతోనే ఉన్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పేసింది. టీడీపీ ఎంపి రామ్మనోహర్ నాయుడు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చారు. ప్రత్యేకహోదా స్ధానంలో ప్రత్యకప్యాకేజి, ఇతర ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. ప్రత్యేకప్యాకేజీ ఏమిటో, ఇతర ప్రోత్సాహకాలేమిటో బ్రహ్మపదార్ధం లాగ తయారైంది. 2014 ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చినా వాటన్నింటినీ ప్రధానమంత్రి కాగానే తుంగలో తొక్కేశారు. విభజన హామీల్లో ప్రధానమైనవి అయిన ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్ లాంటివాటితో పాటు  చివరకు విశాఖ స్టీల్స్ ను ప్రైవేటీకరణ చేసేస్తోంది.




ఎన్డీయే హయాంలో ఏపికి కొత్తగా ఏమీ దక్కకపోయినా దశాబ్దాల క్రితం పోరాటాలతో సాధించుకున్న ఉక్కును కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తామని చెప్పటం మాత్రం ఘోరాతి ఘోరమనే చెప్పాలి. నష్టాలను సాకుగా చూపించి ఉక్కును ప్రైవేటుకు అమ్మేస్తామని చెబుతున్న కేంద్రం సదరు నష్టాలకు కారణాలు తానే అని అంగీకరించటంలేదు. సో ఏతా వాత తేలుతున్నదేమంటే ఏపి ప్రయోజనాలకు మోడి ప్రభుత్వం ఏమీ చేయకపోగా ఇంకా నష్టం చేస్తోంది. దీనికి కారణం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం ఆధరణ లేకపోవటమే. ఒకనాడు ఉండుంటే ఇఫుడు లేదని బాధపడాలి. కాకపోతే ఏదైనా బలమైన గాలి వీచినపుడు మాత్రమే నాలుగు సీట్లలో గెలుస్తుంది. లేనపుడు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేందు.




తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఓటు షేరు 2.41 శాతం. నిజానికి ఇది చాలా తక్కువనే చెప్పాలి. కాకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లశాతం కన్నా ఎక్కువనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లశాతం 0.81 శాతం. అలాంటిది తాజాగా 2.41 శాతమంటే ఎంత పెరిగిందో ఎవరికి వారుగా అంచనా వేసుకోవాల్సిందే.  11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటిల్లో వేలాది వార్డులు, డివిజన్లుంటే కమలంపార్టీకి దక్కింది కేవలం 7 మాత్రమే. చెప్పుకోవటానికి పే.....ద్ద లీడర్లున్నారు. కానీ గెలిచిన వార్డులు మాత్రమే ఏడంటే ఏడు మాత్రమే. ఇందుకే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోడికి మంచి క్లారిటినే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: