టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌ చిరిగిన చొక్కాతోనే రాజకీయం చేస్తున్నారు. తన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించి  ప్రజాస్వామ్య గుడ్డలు చించారంటూ ఆయన డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం తాను చేసిన తప్పా అని చింతమనేని నిలదీశారు.  హరిరామ జోగయ్య అదే ఆసుపత్రి వద్ద ఉన్నారనే వంకతో తన కార్యక్రమo అడ్డుకున్నారని చింతమనేని ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.


హరిరామ జోగయ్య ను పరామర్శించినా తప్పేంటి అని చింతమనేని ప్రభాకర్‌ ప్రశ్నించారు. ఇప్పటికే తనపై 31 కేసులు పెట్టారని..తను అన్నింటికీ తెగించి ఉన్నానని చింతమనేని ప్రభాకర్‌ తేల్చిచెప్పారు. జగన్మోహన్ రెడ్డి తాత దిగొచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని చింతమనేని ప్రభాకర్‌ఎద్దేవా చేశారు. డీఎస్పీ సత్యనారాయణపై ఫిర్యాదు చేసేందుకు చింతమనేని, దేవినేని ఉమా నిన్న డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అయితే.. డీజీపీ కి బదులు డీఐజీ అమ్మిరెడ్డి ఫిర్యాదు తీసుకున్నారు. తన ఫిర్యాదు పట్ల విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని అమ్మిరెడ్డి హామీ ఇచ్చారని చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు.


ప్రభుత్వం, పోలీసులు అనవసర ఆటంకాలు సృష్టించ వద్దని చింతమనేని ప్రభాకర్‌ హితవు పలికారు. దొంగే పోలీసు అయినట్లుగా రాష్ట్రం లో పాలన సాగుతుందని చింతమనేని ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. తన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించి  ప్రజాస్వామ్య గుడ్డలు చించారని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు.  ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని మండిపడ్డారు. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చింతమనేనికి పట్టిన గతే అందరికీ పడుతుందంటూ తనను ఉదాహరణగా చూపాలనుకుంటున్నారని చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్పీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారని చింతమనేని ప్రభాకర్ వాపోయారు. తన బట్టలు చించిన పోలీసులకు రేపు బట్టలుంటాయా  అని చింతమనేని ప్రభాకర్ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: