మనిషి ఏ వస్తువుకైనా అలవాటు పడితే అది ఎంత ధర పెరిగినా నిత్యావసరం అయితే దాన్ని వాడకుండా ఉండలేరు. దీనికి ఉదాహరణ సెల్ ఫోన్.. గతంలో ఫోన్ లేకుండానే అన్ని సమాచారాలను ఇచ్చి పుచ్చుకునే వారు. కానీ ప్రస్తుతం సెల్ ఫోన్ లేని వ్యక్తి లేరంటే అతిశ యోక్తి కాదు. అంతేనా దాంట్లో మరింత మెరుగుపడి డాటా ఉపయోగించి అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నాడు. జియో రాకముందు డాటా ధరలు ఎక్కువగా ఉంటే జియో 999తో సంవత్సరం ఆఫర్ ఇచ్చింది. మనిషికి దాన్ని అలవాటు చేసింది. అంతే ఒకసారి అలవాటయ్యాక దాని ధరని అమాంతం పెంచేశాయి.


ప్రస్తుతం నాలుగు వేల పైన భారం పడుతున్నా ఏ మాత్రం సంశయం లేకుండా వాడేస్తున్నారు. అచ్చం ఇలాగే మనం వాడుతున్నా విద్యుత్ గతంలో కనీసం 3, 4 గంటలు కూడా సరిగా ఉండేది కాదు. పల్లెటూళ్లలో అయితే 12 గంటలకు పైగా పోయేది. ఇలాంటి విద్యుత్ కోతలను అధిగమించి 24 గంటల విద్యుత్ ఇచ్చే విధంగా గ్రిడ్ ల అనుసంధానం ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా చేపట్టారు. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో సప్లయ్ లో చేంజ్ రావడం.. దాని వాడకంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.


దీన్ని అధిగమించాలంటే సోలార్ వాడకాన్ని దేశంలో ప్రారంభించారు. ఇదిప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏటా సోలార్ వాడకం పెరిగిపోతూనే ఉంది. ఒక సర్వే ప్రకారం.. భారత్ లో మూడు సంవత్సరాలలో 91 శాతం సోలార్ విద్యుత్ వాడకం పెరిగినట్లు తెలుస్తోంది. 2018-19 26,180 మెగా వాట్లు, 2019-20 లో  34,627 మెగా వాట్లు, 2020-21 ఏడాదిలో 40,085 మెగా వాట్లు, 2021-22 ఏడాదిలో 50,996 మెగావాట్ల సోలార్ విద్యుత్ వాడకం పెరిగింది. మరి కొన్ని సంవత్సరాల్లో సోలార్ విద్యుత్ వాడకం మరింత పెరుగుతుందని చెప్పడంలో  ఏ మాత్రం సందేహం లేదు. అలాగే ఈ సోలార్ విద్యుత్‌ పర్యావరణానికి సైతం మేలు చేసేది కావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: