
ఇలా కాకుండా ఇప్పటికే రెండు స్థానాలు ఓడిపోయి పవన్ తన అభిమానులను నిరాశపరిచాడు. అంతే కాకుండా రాజకీయాల్లో తను పనికిరాడు అనే వాదనను ప్రతిపక్షాల దగ్గర చేర్చాడు. ఇలాంటి విమర్శలు అన్నిటిని దూరం చేయాలంటే పవన్ గెలవాలి. తనతో పాటు తనను నమ్ముకొని ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను, నాయకులను గెలిపించాలి. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి తన వెంటే ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి వారిని గెలిపించుకొని తన సత్తా ఏంటో నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆంధ్రలో రాజకీయాల్లో సరికొత్త మార్పులు రానున్నాయి. మూడు పార్టీల రాజకీయం ఉంటే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ పవన్ టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ద్వారా మళ్లీ రెండు పార్టీల మధ్యనే పోటీ జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వీళ్లు కాకపోతే వాళ్లు వారు కాకపోతే వీళ్ళు అనుకుంటూ అధికారాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ వల్ల ఎవరు లబ్ది పొందుతారు. ఏ పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. వీటన్నింటికీ సమాధానాలు రాబోయే సాధారణ ఎన్నికల్లో తేలనున్నాయి.
టిడిపి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన అభిమానులు కలిసి పవన్ ను గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తారు. తద్వారా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరగనుందో.