
మత మౌడ్యం ఉండకూడదన్నది బీజేపీ సిద్ధాంతం. ఇందులోనే ఈజిప్టు అధ్యక్షుడిని జనవరి 26 న జరిగిన రిపబ్లిక్ డే రోజు గౌరవ అతిథిగా పిలిచారు. తాలిబాన్ల తరహాలో ఈజిప్టులో షరియా చట్టాలను అమలు పరచాలని చూశారు. దీనికి వ్యతిరేకంగానే పోరాడిన వ్యక్తే ఇప్పుడు భారత్ కు వచ్చిన వ్యక్తి అబ్దుల్ ఫతా ఎల్సీసీ.. ఈయన షరియా చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈయన సైనిక్ కమాండర్ గా 2012 లో చేశారు. ఇస్లాం పార్టీ అయినటువంటి జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆప్గాన్ లో ఉన్న తాలిబాన్ల తరహాలోనే ఈజిప్టులో షరియా చట్టాన్ని అమలు పరచాలని భావించారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున్న ఉద్యమం చేశారు. అప్పుడు సైనికాధికారిగా ఉన్న ఈయన రెబల్ గా మారారు. కాబట్టే ఈయన్ని అక్కడి ప్రజలు గౌరవించారు.
షరియా చట్టం ప్రకారం మహిళలు చదువుకోకూడదు. చాలా వరకు వారికి కఠిన నిబంధనలు ఉంటాయి. మొత్తం మీద బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే మత మౌడ్యం పేరుతో హక్కులను హరిస్తున్న వారిని ప్రశ్నించడమే తప్ప వారిపై వ్యతిరేకత లేదు అని చాటి చెప్పడం. ఈ విషయంలో బీజేపీ కొంత మేరకు సఫలం అవుతున్నట్లు గానే కనిపిస్తోంది. మరి బీజేపీ ముస్లింలకు దగ్గరవుతుందా.. వీరు చూపుతున్న విధానం సఫలం అవుతుందో లేదో చూడాలి.