కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ అధ్యక్షుడు రేవంత్‌కు మరోసారి ఝలక్ ఇచ్చారు.
సీనియర్ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి షాకులు ఇస్తూనే ఉన్నారు. అనేక సార్లు రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చేసినా నష్టం లేదని అనడంపై జగ్గారెడ్డి మరోసారి తనదైన శైలిలో విభేదించారు.  తీవ్రవాద విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.దేశ ప్రజలకు భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ బలయ్యారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కోసం చేసే పోరాటం చూసి జనజీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. జనజీవన స్రవంతిలో నక్సలైట్లు కలిసే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. చట్ట పరిధిలో ఉద్యమాలు చేయకపోవడం వల్లే నక్సలైట్లు అడవుల్లో ఉంటూ సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.


రాజకీయ నాయకులు, నక్సలైట్లు కూడా ప్రజల మంచి కోసమే పోరాడుతున్నారని రాజకీయ నాయకులు చట్టసభల పరిధిలో పనిచేస్తుండగా నక్సలైట్లు చట్టం పరిధి దాటి పనిచేస్తున్నారని అందువల్లే సమాజానికి దూరంగా ఉండాల్సి వస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు ఎన్నో ఉన్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.


అసెంబ్లీ సమావేశాలు అయ్యాక  ఎవరు నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేస్తారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల నేతలు పిలిస్తే వారి నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తన జీవితమంతా ముత్యాలముగ్గు సినిమాలోని హీరోయిన్ మాదిరి అయ్యిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్‌ వేశారు. మరి ఇలాంటి సెటైర్లు పార్టీకి మేలు చేస్తాయా.. ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోకుండా ఇలా బహిరంగంగా మాట్లాడం సబబేనా అంటారా.. అదే కదా మరి కాంగ్రెస్‌ స్టయిల్ అంటే..

మరింత సమాచారం తెలుసుకోండి: