అమెరికాలో నిఘా పెట్టేందుకు పంపిన చైనా బెలూన్లను అగ్రరాజ్యం పేల్చేసింది. ఈ బెలూన్ల వెనక గూఢచర్యం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. వాతావరణ విషయాలే కాకుండా గూఢచర్యం ఉన్నట్లు తెలుస్తోంది.  చైనా చేస్తున్నట్లు భారత్ అనుమానిస్తోంది. 2022 సంవత్సరంలో అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి ఒక బెలూన్ సంచరించినట్లు తెలుస్తోంది. అయితే అది ఎవరూ పంపించారు. ఎందుకు పంపారు. దాని వల్ల భారత్ లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా? అనే వివరాలను ప్రస్తుతం భారత అధికారులు చేపట్టనున్నారు.


దీనికి కారణం గత నెలలో అమెరికాలో చైనా రహస్యంగా పంపిన బెలూన్ ని వైట్ హౌస్ అధికారులు గుర్తించి దాన్ని పేల్చి వేశారు. అనంతరం మరో బెలూన్ని కూడా చైనా అమెరికా సముద్ర జలాల్లో తిరిగితే దాన్ని కూడా పేల్చిన విషయం అందరికీ తెలిసిందే.  మొదట పంపిన వస్తువు చాలా పెద్దది.. బలమైనది ఎక్కువ బరువుతో కూడుకున్నది అని అమెరికా చెప్పింది. అది సముద్ర జలాల్లో ఎవరూ లేని ప్రాంతంలోనే దాన్ని పేల్చి వేసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. దాని తర్వాత వచ్చిన బెలూన్ చాలా చిన్నదని పేర్కొంది. దాన్ని కూడా పేల్చివేసినట్లు తెలిపింది.


అయితే చైనా ఇలా వేరే దేశాల సరిహద్దుల్లోకి బెలూన్లను ఎందుకు పంపిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే ఇవి ఆయా దేశాల్లో ఉన్న సరిహద్దులు, గూఢచర్యాన్ని నిర్వహిస్తున్నట్లు భారత్ అనుమానం వ్యక్తం చేసింది. చైనా చేస్తున్న దుందుడుకు చర్యల వల్ల అమెరికా కోపంతో ఉంది. ఇలాంటి చర్యల్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని అమెరికా చైనాను హెచ్చరించింది. ఇదే సమయంలో గత సంవత్సరంలో భారత సముద్ర జలాల్లోకి వచ్చిన అపరిచిత వస్తువుపై ఇప్పుడు అధికారులు పరిశీలన చేపట్టారు. మరి ఆ వస్తువు గూఢచర్యం చేయడానికి వచ్చిందా. నిఘాను పరిశీలించేందుకు వచ్చిందో అధికారులు చేపట్టిన దర్యాప్తు పూర్తయితే కానీ చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: