ప్రస్తుతం ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ఒక వైపు, డ్రోన్ టెక్నాలజీ మరో వైపు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. రష్యా వేల కోట్లు పెట్టుబడి పెట్టిన పెద్ద మిస్సైల్ ను 50 లక్షలు విలువ చేసే డ్రోన్ తో బెలారస్ కూల్చివేసింది. దీంతో రష్యా కంగుతింది. గతంలో పెద్ద పెద్ద మిస్సైల్స్ ను తయారు చేసి వాటిని అప్ గ్రేడ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు. కానీ ఇప్పుడు వాటిని కూల్చేయడానికి డ్రోన్లను వాడుతున్నారు.


ప్రస్తుతం మేకిన్ ఇండియాలో భాగంగా డ్రోన్ టెక్నాలజీలో ముందుకు సాగిపోతుంది. ప్రస్తుతం తపస్ అనే సరికొత్త టెక్నాలజీతో డ్రోన్లను తయారుచేసింది. తపస్ అంటే టాక్టికల్ ఎయిర్ బాంబ్ ప్లాట్ పామ్ పర్ ఎరియల్ సర్వే అనే దాన్ని భారత్ రెడీగా పెట్టుకుంది. దీని వేగం 240 కిలోమీటర్లు, ఇది 28 వేల అడుగుల ఎత్తులో ఏకబిగిన 18 గంటల పాటు ప్రయాణం చేయగల సామర్థ్యంతో కూడుకున్నది.


దీని రేంజ్ 1000 కిలోమీటర్లు, దీన్ని భారత్ ఎలక్ట్రానిక్స్, హిందూస్థాన్ ఏరో నాటికల్స్ లిమిటెడ్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన అంశం ఏమిటంటే యుద్ధ విమానాలు కాదు, యుద్ధ విమానాలను కూల్చేసే డ్రోన్లను తయారు చేస్తే చాలు.. ఎన్ని వేల కోట్లతో తయారు చేసిన యుద్ధ విమానాల్ని అయినా ఇట్టే కూల్చేయవచ్చు. ప్రస్తుతం యుద్ధరంగంలో సమూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది.


విధ్వంసం చేయడానికి ఆయుధాలు ఉంటే సరిపోదు. వాటిని కాపాడుకోవడం సవాలుతో కూడుకున్న పనే. ఎదుటి వారు తమ దేశంపై యుద్ధ విమానాలతో విరుచుకుపడితే మళ్లీ దాన్ని ముక్కలు చేయడానికి చిన్న డ్రోన్ పని చేస్తే చాలు.  డ్రోన్ టెక్నాలజీని అన్ని దేశాలు రూపొందించుకుంటే దాన్ని దాటుకుని మరే వెఫన్ వెలుగులోకి వస్తుందో చూడాలి. కోట్లు పెట్టి కొన్న మిస్సైల్ ను చిన్న డ్రోన్ కూల్చేయడం గొప్ప విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: