తాజాగా ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను బయటపెట్టింది. ప్రపంచ దేశాల్లో  భారత్ 125 స్థానంలో ఉందని చెప్పింది. సౌకర్యాల పరంగా అన్ని విషయాల్లో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే  భారత్ ఆ స్థానంలో ఉందని తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో ఉండేటువంటి పెత్తందారి వ్యవస్థ ముఖ్యంగా చెప్పాలంటే ఐక్యరాజ్యసమితిని నడిపిస్తుంది అమెరికా అని చెప్పొచ్చు. మొన్నటి వరకు శ్రీలంక పూర్తి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దానికి డబ్బులు, ఆహార ధాన్యాలు ఇచ్చి ఆయిల్ ఇచ్చి ఆదుకుంది ఇండియా. ఇవేవీ వారికి కనిపించవు. శ్రీలంక లాంటి దేశం  భారత్ కంటే మెరుగైన దేశం అని చెప్పింది. ఏ ప్రాతిపదికన చెబుతారో కానీ అవి అస్సలు అర్థం అయ్యే విషయాలు కావు.


భూటాన్ లాంటిది చిన్న దేశం అక్కడ జీవనం ప్రశాంతంగా ఉండొచ్చు కానీ భారత్ ఎక్కువ మంది జనాభా కలిగినటువంటి దేశం. కోట్ల మంది జనాభాకు ప్రతి సౌకర్యాన్ని దగ్గరకు తీసుకెళ్ల లేకపోవచ్చు కానీ ఇక్కడ మెరుగైన ఉపాధి ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి చిన్న దేశాలకు ఆర్థికపరమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా భారత్ ఆదుకుంటుంది.


ఇలాంటి నివేదికలు అమెరికా భారత్ పై విషం చిమ్మే ప్రయత్నం లాంటిదే. ఇక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాకుండా చేసేందుకు ఇలాంటి నివేదికలను ఇస్తుంటారు. తద్వారా భారత్లో నూతన పరిశ్రమలు రాకుండా అడ్డుకొని గెలిచామని సంతృప్తి పడుతుంటారు.  పరిశ్రమ రంగం కొత్త పెట్టుబడిదారులు ఎక్కువగా జనసాంద్రత ఉన్న దేశాల్లోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారన్న  విషయాన్ని మర్చిపోతుంటారు.


ఎంత చేసినా ఎన్ని రకాలుగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా అది వారి వల్ల కాదు. ఐక్యరాజ్యసమితి ఏ ప్రాతిపదికన ఇలాంటి నివేదికలు ఇస్తుందో తెలియదు. కానీ భారత్ లో ఉన్నటువంటి సౌకర్యాలు మరే దేశంలో ఉండవు. ఇక్కడ ఉండే జీవన విధానం ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేవి ఒక పద్ధతిలో నడుస్తుంటాయని నివేదిక ఇచ్చిన వారికి తెలియకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

UNO