తెలుగుదేశంలోకి వస్తామని చెబుతున్నా వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య కాస్త తగ్గినట్లే కనిపించింది. మొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మాజీ ఎమ్మెల్యే అనిత 40 ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వచ్చేవాళ్లు ఉన్నారని ప్రకటించారు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 16 మంది వస్తున్నట్లు చెప్పారు. కానీ ఎవరు వస్తున్నారు. వారి వివరాలు మాత్రం చెప్పలేదు.


ఆంధ్రజ్యోతి రీసెంట్ గా ఇచ్చిన కథనంలో మాత్రం 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. అంటే మొత్తం మీద వైసీపీ లో నుంచి టీడీపీకి 20 మంది దాకా ఎమ్మెల్యేలు వస్తున్నట్లు కథనాలను ప్రచురించింది. కారణం వైసీపీలో ఆ పార్టీ విధానాలు నచ్చట్లేదని చెబుతోంది. అసలు కారణం ఎంటంటే జగన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని తెగేసి చెప్పినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి.


గతంలో జరిగిన సమావేశంలో సీఎం జగన్పార్టీ ఎమ్మెల్యేలకి కొన్ని సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు వారంలో కచ్చితంగా రెండు మూడు రోజులైనా ప్రజల్లోకి వెళ్లాలని, గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. ఇలా తెలుసుకోలేని పక్షంలో వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని చెప్పారు. ఈ మాటలు విన్న కొంతమంది ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. తద్వారా పార్టీ టికెట్ కన్మర్ప్ చేసుకున్నారు. పార్టీ విధానాలకు సంబంధించి కచ్చితంగా పాటిస్తేనే టికెట్ ఇస్తామని చెప్పారు.

 
టీడీపీ పార్టీలోకి వెళ్లే వారికి టికెట్లు ఎలా ఇస్తారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఉన్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జిలు ఉన్నారు. వారిని టీడీపీ అధినేత ఎలా మెప్పిస్తారు. మరి ఆ నియోజకవర్గంలో ప్రజలు పాత క్యాండిటేట్ ఓడిపోయాడు అనే సానుభూతితో ఓట్లు వేస్తే మళ్లీ వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. మరి టీడీపీలో చేరే వైసీపీ అభ్యర్థులకు ఎలాంటి హామీ ఇస్తారోనని చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: