
ఉక్రెయిన్ వ్యవహారాలు, ఇజ్రాయిల్ వ్యవహారాలు కూడా ఆ పేపర్లలో రావడం సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ వద్ద ఎయిర్ స్ట్రైక్ చేసే యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ యుద్ధ విమానాలు అయిపోతున్నాయి. అంటే రష్యా నుంచి వచ్చే యుద్ధ విమానాలను దారిలోనే గుర్తు పట్టి వాటిని పేల్చేసే అధునాతన టెక్నాలజీ మిస్సైల్స్ అయిపోయాయి.
ఇన్ని రోజులు అమెరికా, యూరప్ దేశాల నుంచి ఈ మిస్సైల్స్ వచ్చాయి. దాదాపు 95 శాతం ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం 5 శాతం మాత్రమే ఉక్రెయిన్ వద్ద ఉన్నాయని తెలుస్తోంది. ఈ అయిదు శాతం మిస్సైల్స్ తో వచ్చే నెల మే వరకు యుద్ధాన్ని కొనసాగించొచ్చు. ఆ తర్వాత అమెరికా, యూరప్ దేశాలు సమకూర్చకపోతే ఉక్రెయిన్ రష్యా చేసే దాడిని తిప్పికొట్టలేక పోతుంది.
గగన తలంలో వాటిని అడ్డుకుంటేనే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక వేళ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ అయిపోతే రష్యాను ఉక్రెయిన్ ఎలా ఎదుర్కొగలదు. కాబట్టి అమెరికా, యూరప్ దేశాలు వెంటనే ఉక్రెయిన్ కు మిస్సైల్స్ అందజేస్తేనే యుద్ధం ఇంకా కొనసాగగలదు. లేకపోతే చేతులెత్తేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని పేపర్లలో ప్రచురితమైంది. దీన్ని ఉక్రెయిన్ కొట్టి పారేసినా ఇదే వాస్తవమనే విషయాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతుంది. ఇంకా ఎన్ని రోజులు పోరాడినా అది అమెరికా అందిస్తున్న చేయూత వల్లే, యుద్ధం ప్రారంభమై 15 నెలలు కావొస్తుంది. ఏ దేశమైనా ఎన్ని రోజులు ఇవ్వగలదు. దీంతో రష్యా, ఉక్రెయిన్ యుద్దం చివరి దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి మరెన్నో రోజులు పట్టదని తెలుస్తోంది.