ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అత్యంత ప్రమాదమైనదిగా మారుతోంది. దీనితో ఒకరు మాట్లాడిన మాటలను వక్రీకరించి చెప్పడం చాలా ఈజీ. లిప్ సింక్ కూడా చేసి దాన్ని అత్యంత పటిష్టంగా చెప్పగలగడం వల్ల చేయని తప్పునకు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఒక వీడియో సోషల్ మీడియాలో పెడితే దానికి లిప్ సింక్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.


ఇది నిజమా, అబద్ధమా అని తెలుసుకోకుండా దాన్ని పూర్తిగా చూపిస్తూ ప్రజల్లోకి తీసుకెళతారు. దీంతో సోషల్ మీడియా లో అది తెగ వైరల్ అవుతుంది. దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. బ్లూబమ్ బర్గ్ కథనం ప్రకారం.. ఐర్లాండ్ లో మహిళ వాయిస్ తో పోలిన మరో వాయిస్ అచ్చుగుద్దినట్లు దింపేశారు. అయితే ఇది ఆమె చేయలేదు. కేవలం టెక్స్ట్ మేసేజ్ చేస్తే ఆమె ఎలా మాట్లాడుతుందో అలానే వచ్చేసింది. దీంతో ఆమెకు వచ్చిన సందేహం వల్ల నేను మాట్లాడినట్లు వచ్చిన వాయిస్ నాది కాదు. ఇది ఎవరో మా ఆఫీసు వాళ్లకు డబ్బులడుగుతూ పంపారని గుర్తించింది.


దీని వల్ల ప్రెండ్స్ తో అచ్చం మనం మాట్లాడినట్టే మన వాయిస్ ను అచ్చుగుద్దినట్లు దింపేస్తుంది. లిప్ సింక్ కూడా అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రాబోయే రోజుల్లో సైబర్ మనీ రాబరీలు పెరిగిపోతాయి. చాలా ఇబ్బంది కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఎంతో మంది మోసపోయే అవకాశం ఉంది. రోబోతో మాట్లాడించిన కూడా అచ్చం మన వాయిస్ ను దించే అవకాశం ఉంటుంది.


ఇలా ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ వల్ల సమస్యల సుడిగుండంలో మనిషి చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి మనిషికి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు వస్తున్నాయి. మనకు తెలియకుండానే మనం బ్యాంకులో దాచుకున్న డబ్బులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మనం మాట్లాడకున్న మాట్లాడినట్టు లిప్ మూమెంట్ ఇస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: