ఆరోగ్యశ్రీని చూసుకునేది వైద్య ఆరోగ్యశాఖ. దానికి సంబంధించిన మంత్రి విడుదల రజిని. అయితే ఈ ఆరోగ్య శ్రీ పై కొత్తగా వస్తున్న చర్చలపై ఆవిడ ఇప్పటి వరకు నోరు మెదపడం లేదని తెలుస్తుంది. వాళ్ల సంస్థకు సంబంధించిన డైరెక్టర్ మాకు ఎవరు నోటీసులు ఇవ్వలేదని ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. పత్రికల్లో అయితే వాళ్లందరూ కూడా, ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి ఇటీవల బ్యానర్ హెడ్డింగ్ దీనిపై పెట్టిందని తెలుస్తుంది.


ఏమని హెడ్డింగ్ పెట్టిందంటే మూసేయ్యపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు ఎవరు ఫస్ట్ తారీకు నుంచి ఇక చేర్చుకోరు ఈ పథకంపై అని హెడ్డింగ్ పెట్టింది. మరి దీనిపై సమాధానం ఎవరు చెప్పాలి, హాస్పిటల్స్ సంఘాల వాళ్ళు అయినా చెప్పాలి. కానీ వాళ్ళు సమాధానం చెప్పరు. ఎందుకంటే వారికి బకాయిలు ఉన్నాయి. గతంలో కూడా బకాయిలు ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో కూడా బకాయిలు ఉన్నాయి. కానీ వాళ్ళు మూడు నెలలకు, నాలుగు నెలలకు తీర్చేవారని తెలుస్తుంది.‌


అయితే ఇప్పుడు వీళ్ళు అసలు తీర్చడం లేదా అంటే ఏ నెలకు ఆ నెల చెల్లిస్తామని చెప్పింది మానేశారా, అసలు ఎన్నాళ్ళ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి అనేటువంటిది ఈ హాస్పిటల్ సంఘాల వాళ్లయినా చెప్పాలి. వాళ్లు మీడియాకు అయితే తెలుగుదేశానికి సంబంధించిన అనుకూల మీడియాకైతే లీక్ ఇచ్చారు గాని బయటపడటం లేదు. రెండవది పబ్లిక్ లో ఒక భయం ఉంది. తమ వాళ్ళు హాస్పటల్లో ఈ పథకం కింద ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళకి, రేపటి పరిస్థితి ఏంటనే సమాధానం చెప్పే వాళ్ళు కరువైపోయారు.


మూడవ  పాయింట్ వచ్చేసరికి ఇక్కడ విడుదల రజనీ  అసలు అక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి చెప్పాలి. ఆరోగ్యశ్రీ అధికారి వచ్చి మాత్రం దాంట్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు, అది రొటీన్ ప్రాసెస్ అని చెప్తున్నారు. సాధారణ పరిస్థితి నుంచి పైకి వెళ్ళిన  ఆవిడ కూడా దీనిపై సమాధానం చెప్పకపోవడం ఏమిటనేదే ఇప్పుడు సమస్య.

మరింత సమాచారం తెలుసుకోండి: