అకాల వర్షాలతో తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఆయన ఆదేశాల మేరకు ధాన్యమంతా కొంటామని  పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సర్ధార్ రవీందర్‌ సింగ్ భరోసా ఇచ్చారు.  ఈ విషయంలో రైతాంగం ఏ మాత్రం ఆందోళన చెందొద్దు, ఆధైర్యపడాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సర్ధార్ రవీందర్‌ సింగ్  తెలిపారు.


కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం మిల్లర్లు వెంటనే అన్‌లోడింగ్ చేసుకుని ఆ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సర్ధార్ రవీందర్‌ సింగ్ చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచేందుకు మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సర్ధార్ రవీందర్‌ సింగ్ అన్నారు. తడిసిన ధాన్యం సరైన పద్ధతిలో ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులను సర్ధార్ రవీందర్‌ సింగ్ కోరారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలని సర్ధార్ రవీందర్‌ సింగ్ అన్నారు.


ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని సర్ధార్ రవీందర్‌ సింగ్ భరోసా ఇచ్చారు. కాల వర్షాలపై జిల్లా స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం రైతాంగంపై ఏ మాత్రం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సర్ధార్ రవీందర్‌ సింగ్ సూచించారు. ఇది దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు రైసు మిల్లులకు తరలించాలని సర్ధార్ రవీందర్‌ సింగ్ ఆదేశించారు.


వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రవీందర్‌ సింగ్ ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా రైతాంగానికి నష్టం జరగకుండా సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రవీందర్‌ సింగ్ సూచించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు లక్ష మంది రైతుల నుంచి 1710 కోట్ల రూపాయల విలువైన 8.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రవీందర్‌ సింగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr