
కానీ పవన్ బీజేపీతో కాకుండా కేవలం టీడీపీతోనే దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రలో బీజేపీ ఎదిగితే దానికి పెద్ద ఎత్తున నష్టపోయేది వైసీపీ. కానీ బీజేపీ ఎక్కువగా ఓట్ల శాతం పెరిగితే మరో నష్టం జనసేనకు ఉంటుంది. జనసేనకు రావాల్సిన ఓట్లు బీజేపీ వైపు వెళ్లిపోతాయి. తద్వారా బీజేపీ బలపడుతుంది. దీంతో బీజేపీకి బలం పెరిగి సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జనసేన పార్టీకి ఓటింగ్ శాతం తగ్గి బలహీన పడే అవకాశం ఉందనే అంచనాలతో బీజేపీకి దూరంగా ఉండాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తోంది.
బీజేపీ స్థానం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ, జనసేన తర్వాత ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేన కంటే ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ బలపడుతుంది. మూడు లేదా రెండో స్థానానికి వెళితే జనసేన కంటే ఎక్కువ బలమున్న పార్టీగా అవతరిస్తుంది. ఇది పవన్ కల్యాణ్ కు ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. బీజేపీ కంటే టీడీపీతోనే పొత్తుకుసై అంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుల మీటింగ్ పెట్టుకుంటన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో బీజేపీ నెక్ట్స్ తీసుకునబోయే స్టెప్ ఏంటి అనేది చూడాలి. అలాగే కాపు సామాజిక వర్గం ఆశిస్తున్న సీఎం స్థానం ఇక కలగానే మిగిలిపోనుందా.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ ఎమ్మెల్యే, లేకపోతే మంత్రి అవుతారు. ముఖ్యమంత్రిగా మాత్రం చేయలేరనే వాదన వినిపిస్తోంది.