
వైసిపి వాళ్ళు ఇంకా ఆయన్ని పార్టీలోకి తీసుకుపోయినా ఈయన మానసికంగా ప్రిపేర్ అయిపోయారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యన రాపాక డబ్బులు ఇచ్చాము దొంగ ఓట్లు ఎలా వేయించాము అన్న వ్యాఖ్యలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత రాపాక దీనిపై వివరణ ఇస్తూ నేను చెప్పింది ఇప్పుడు గురించి కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కౌన్సిలర్ స్థాయిలో పోటీ చేసినప్పుడు, వార్డ్ మెంబర్స్ స్థాయిలో పోటీ చేసినప్పుడు నా పక్కన ఉన్న వాళ్ల గురించి నేను మాట్లాడాను అని చెప్పడం అయితే జరిగింది.
అయితే రాపాకకు సంబంధించిన ఈ వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వమని చెప్పి కోనసీమ కలెక్టర్ ను ఆంధ్రప్రదేశ్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీస్ నుండి ఈ నివేదికను కోరుతూ లోకల్ గా ఉన్నటువంటి వాళ్లకి ఆదేశాలు వచ్చాయని తెలుస్తుంది.
దీనిపై కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాకేతపురి మండల్ రాజోలు నియోజకవర్గం కోనసీమ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వెంకటపతి రాజు యనమల ఇచ్చిన కంప్లైంట్ ని ఆధారంగా విచారణ చేసి నివేదికను ఇవ్వమని కలెక్టర్ ను ఆదేశించింది ఎలక్షన్ కమిషన్.