రష్యా, ఉక్రెయిన్ యుద్దం  రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. రష్యాపై ప్రతిఘటన పెంచి వారిపై తీవ్ర స్థాయిలో దాడి చేయాలని ఉక్రెయిన్ భావిస్తే అమెరికా, యూరప్ దేశాలు అంతే స్థాయిలో దాడి చేసే ఆయుధాలు ఇవ్వడం లేదు. సాధారణ మైనవి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి.
ఒక వేళ ఆ రోజు రష్యా భీకర దాడి చేస్తే అప్పటికప్పుడు కాస్త మెరుగైన ఆయుధాలు సమకూరుస్తున్నాయి. కానీ యద్దం ముగించేలా నాటో దేశాలు, అమెరికా తమకు సహకరించడం లేదని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది.


కేవలం తూతూ మంత్రంగా సాయం చేసి వదిలించుకోవాలని చూస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. ఉక్రెయిన్ అడిగిన ఆయుధాలు ఇవ్వడం లేదు. వారికి నచ్చినవి మాత్రమే ఇస్తుంది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ గా ఉన్న దేశం రష్యాగా మారింది. దాదాపు 16 దేశాలు ముక్కలుగా విడిపోయి కేవలం రష్యా గా ఒంటరిగా నిలిచిపోయింది. అమెరికా ను నమ్మడం మానేసింది ఉక్రెయిన్. నాటో దేశాలను, అమెరికాను ఉక్రెయిన్ నమ్మడం లేదు. ఎందుకంటే నాటో దేశాల్లో చేర్చుకోవడం లేదు. పూర్తి స్థాయి లో యుద్దానికి సహకరించడం లేదు.


దీంతో విసుగు చెందిన ఉక్రెయిన్ సరికొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసుకుంది. దీంతో దాని చుట్టు పక్కలా ఉన్న దేశాలను మచ్చిక చేసుకుని అవన్నీ కలిసి రష్యా పెత్తనం ఉండకుండా చూసేందుకు ప్రయత్నించాాలని సంకల్పించింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే రష్యా పక్కన ఉండే దేశం పోలండ్, ఉక్రెయిన్, లిథువేనియా, తదితర దేశాలతో కలిపి కూటమిగా తయారు కావాలని భావిస్తోంది. అమెరికాను నమ్మి ఎక్కువ కాలం పోరాటం చేయలేమని నిర్దారించుకుంది.


దీంతో కొత్త కూటమి చేయాలని భావిస్తోంది. మరి ఈ కూటమి నిలబడగలుగుతుందా.. నాటో లాంటి దేశాలు, అమెరికా చేయలేని పనిని ఈ చిన్న దేశాల కూటమి చేసి చూపిస్తుందా.. అసలు రష్యా ముందు పోరాటం చేయగల శక్తి వీటికి ఉంటుందా అనేది సందేహమే.

మరింత సమాచారం తెలుసుకోండి: