కరోనా అనేది జాతీయ విపత్తు.. తుఫాన్ లు ప్రకృతి విపత్తులు... ఇందులో దేనికి కేంద్రం ప్రజలకు నష్టపరిహారం చెల్లించడం న్యాయం అనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో... సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా వినపడుతున్న ప్రశ్న. మీరు విమానాలు ఆపి ఉంటే కరోనా రాదు కదా... మీ తప్పే కాబట్టి ఇప్పుడు దానికి ప్రజలకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే అంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అది న్యాయమేనా...? 3 లక్షల 20 వేల మంది కరోనాతో మరణించారు. అందరికి 2 లక్షలు లేదా 4 లక్షలు ఇవ్వడం సాధ్యమవుతుందా...?
సాధ్యం కాదు అంటే ఎందుకు సాధ్యం కావడం లేదు...? ఇన్ని రోజులుగా పన్నులు కడుతున్న ప్రజలకు మీరు ఇది కూడా చేయలేరా అంటూ ప్రశ్నలు. తుఫాన్ అనేది ప్రకృతి విపత్తు. తుఫాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ప్రకృతి విపత్తులో ఎవరిది లోపం లేదు కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి. వేరే దేశంలో వైరస్ ఉంది... అగ్ర దేశాలకు పాకిందని భావించినప్పుడు విమానాలు ఆపాలి... కాని ఆపలేదు కాబట్టి ఇది జాతీయ విపత్తుగా మారింది కేంద్రం దీనికి బాధ్యత వహించాలి... అనేది నిపుణుల డిమాండ్. నిజమే దీనికి కేంద్రమే బాధ్యత వహించాలి.
కేంద్రం చేసిన తప్పుతోనే రాష్ట్రాలకు వ్యాపించింది కరెక్ట్. కాని రాష్ట్రాలు సరిహద్దులను విమానాలను అడ్డుకుని ఉంటే రాష్ట్రాలకు వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఇందులో రాష్ట్రాల పాత్ర కూడా కొంత వరకు ఉంది. ఇక్కడ ఎవరికి భారీ నష్టపరిహారం అయితే కేంద్రం ఇవ్వడం లేదు. ఇప్పుడు 4 లక్షలు కేంద్రం ఇస్తుంది కరోనాతో మరణించిన వారికి అనేది ప్రధానంగా వినపడుతున్న మాట. అటువంటిది ఏమీ లేదు... కేంద్రం మరణించిన ప్రతీ ఒక్కరికి 4 లక్షలు ఇవ్వడం సాధ్యం కాదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్ముకుంటే అనవసరంగా నిరాశని ఎదుర్కోవాలి... లేని బాధను తెచ్చుకోవాలి. కలెక్టర్ కి దరఖాస్తు చేసుకోవాలి అది ఇది అని ప్రచారం చేస్తున్నారు.
నిజంగా అలాంటిదే ఉంటే స్వయంగా ప్రధాని ప్రకటిస్తారు... లేదా ఆరోగ్య శాఖ మంత్రి గాని లేదా ఆరోగ్య శాఖ కార్యదర్శి గాని ప్రకటిస్తారు. అనవసరంగా తప్పుడు ప్రచారం నమ్మకండి.కొన్ని రాష్ట్రాలు 15 వేలు లేదా అంతకు మించి ఒక 5 వేలు ఇస్తున్నాయి. కరోనా బాధితులు మరణిస్తే వారి పిల్లలకు ఫిక్సిడ్ డిపాజిట్ చేసి ఆర్ధికంగా అండగా ఉంటున్నాయి. ఏపీ, ఓడిశా ముందు అడుగు వేసాయి. కేంద్రం ఇందులో విఫలం అయింది దానికి తోడు కేంద్రం వద్ద నిధులు కూడా లేవు కాబట్టి... ప్రజలకు ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం మాత్రమే కరోనా బాధితులకు ఉపకరిస్తుంది. ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటీ అంటే... కరోనాతో మరణించిన వారు ఎవరు...? సహజ మరణం ఎవరిది అనేది తెలుసుకోవడం కూడా కష్టమే.
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ లకు కేంద్రం ఆర్ధిక సహాయం చేసింది. కోవిడ్ కారణంగా మరణించిన జర్నలిస్టుల 67 కుటుంబాలకు కేంద్రం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. కోవిడ్ -19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో రూ .10 లక్షలను ఎక్స్‌గ్రేషియాగా ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం 18 ఏళ్లలోపు పిల్లలకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వ్యాపార పరంగా... లేదా వ్రుత్తి పరంగా నష్టపోయిన వాళ్ళకే రాష్ట్ర ప్రభుత్వాల సహాయం గాని కేంద్రం నుంచి అయితే 4 లక్షలు రావడం లేదు.;
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి